Malla Reddy : నేను బీఆర్ఎస్ లో ఉండను.. కాంగ్రెస్ లోకి వెళ్లిపోతా.. మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్ వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Malla Reddy : నేను బీఆర్ఎస్ లో ఉండను.. కాంగ్రెస్ లోకి వెళ్లిపోతా.. మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్ వైరల్

 Authored By kranthi | The Telugu News | Updated on :4 December 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  పని చేశాం కాబట్టే ప్రజలు గెలిపించారు

  •  ఈ జిల్లాకు మంత్రిని కాబట్టే జిల్లా మొత్తం బీఆర్ఎస్ వచ్చింది

  •  వాళ్లూ మంచి పథకాలే ప్రకటించారు

Malla Reddy : మేడ్చల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరుపున మల్లారెడ్డి గెలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను గెలిపించిన వాళ్లకు అందరికీ ధన్యవాదాలు. నేను చూసిన పనిని గుర్తించి నన్ను మరోసారి గెలిపించినందుకు వాళ్ల రుణం ఎప్పుడూ మరిచిపోను. వాళ్లకు ఎప్పటికీ సేవ చేసే భాగ్యం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు మల్లారెడ్డి. ఏది ఏమైనా ప్రజల తీర్పును మేము శిరసావహిస్తాం. తప్పకుండా వాళ్లకు కూడా సహకరిస్తాం. వాళ్లు కూడా మంచిగా ఆరు గ్యారెంటీ హామీలు పెట్టారు. అవన్నీ అమలు చేస్తే ప్రజలకు బాగా సంతోషం. ఏం ఇబ్బంది కరం లేదు.. అంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.

మా జిల్లాలో అలా పని చేశాం కాబట్టే ప్రజలు మమ్మల్ని గుర్తించి మా జిల్లాను గెలిపించారు. జిల్లా మొత్తం బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. మా జిల్లాకు మంత్రిగా ఉన్నాను కాబట్టి.. నేను కెప్టెన్ కాబట్టి అట్లా బీఆర్ఎస్ గెలిచింది అంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీరు కాంగ్రెస్ లోకి వెళ్తారా.. బీఆర్ఎస్ లో ఉంటారా అని ప్రశ్నించగా.. ఇదేం ప్రశ్న అంటూ కొప్పడ్డారు మల్లారెడ్డి. ఇది ప్రజా స్వామ్యం. వాళ్లకూ పాలించే అవకాశం ఇచ్చారు. అందులో తప్పేం ఉంది. వాళ్లు కూడా నడపనివ్వండి అని మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుంది అని అనుకోబోతున్నారు అంటే.. నాకు ఏం అనుభవం లేదు అని చెప్పుకొచ్చారు మల్లారెడ్డి.

Malla Reddy : సడెన్ గా ఎంపీ అయ్యా.. సడెన్ గా మంత్రి అయ్యా.. సడెన్ గా ప్రతిపక్షంలో కూర్చొంటున్నా

నాకు రాజకీయాల్లో అనుభవం లేదు. సడెన్ గా ఎంపీ అయ్యా. సడెన్ గా మంత్రి అయ్యా. సడెన్ గా ప్రతిపక్షంలో కూర్చొంటున్నా.. అంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. కేబినేట్ లో కూర్చొన్నా.. ప్రతిపక్షంలో కూర్చొన్నా ఒక్కటే నాకు అంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రజలు మళ్లీ మీరు మంత్రి కావాలని కోరుకుంటున్నారు అంటే.. ప్రజలకు ఉంటది. పని చేశాం కాబట్టి వాళ్లకు ఉంటది అని చెప్పుకొచ్చారు మల్లారెడ్డి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది