
revanth reddy as telangana new chief minister
Revanth Reddy : తెలంగాణ రెండో ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నిన్ననే ఫలితాలు వెలువడ్డాయి. మ్యాజిక్ ఫిగర్ కంటే 4 సీట్లను ఎక్కువే సాధించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇవాళ ఉదయం జరిగిన సీఎల్పీ మీటింగ్ తర్వాత రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు.
దీంతో ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో రాత్రి 8.30 కు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.మరోవైపు రాజ్ భవన్ లో సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాటు జరుగుతున్నాయి. సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు భట్టి విక్రమార్క, సీతక్కలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే చాన్స్ ఉంది.
ఐటీ మంత్రిగా మధన్ మోహన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. మధన్ మోహన్ ఐటీ రంగంలోనే ఇది వరకు పని చేశారు. అందుకే ఆయన పేరు వినిపిస్తోంది. హోంమంత్రి, ఇతర శాఖలను ఎవరికి అప్పగిస్తారో ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై.. కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఈరోజు రాత్రి రాజ్ భవన్ లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
Business Ideas: ఉద్యోగం దొరకలేదని లేదా చేస్తున్న జాబ్‌లో సరైన ఆదాయం లేదని చాలా మంది యువత(youth) నిరాశ చెందుతున్నారు.…
Today Gold Rate 18 January 2026 : గత కొద్ది రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పెరుగుతూ రావడం…
Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి సోషల్…
Winter Season : చలికాలం మొదలైతే మన చుట్టూ ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. కొందరు మంచు గాలులు వీచినా…
Mouni Amavasya : మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తారు. హిందూ సంప్రదాయాల్లో ఈ తిథికి విశేషమైన…
Zodiac Signs January 18 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
Kavitha : ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో చర్చనీయాంశంగా మారుతూనే…
Mana Shankara Vara Prasad Garu Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్‌లో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్…
This website uses cookies.