Minister Konda Surekha : ప్రతిపక్ష పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలను అధికార కార్యక్రమాలకు పిలవకుండా కాంగ్రెస్ నాయకులు పిలుస్తున్నారు అనే విషయం పైన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రతిరోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర వాదోపవాదనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి ఆలయ జాతరకు సంబంధించి సమీక్ష సమావేశంలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కొమురవెల్లి ఆలయం జనగాం నియోజకవర్గ పరిధిలోకి వస్తున్నందున అధికారులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ సమావేశానికి అతిధులుగా ఆహ్వానించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రాజేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. మంత్రి కొండా సురేఖ ప్రతాపరెడ్డిని స్టేజి మీదకి ఆహ్వానించడంతో అది నచ్చని రాజేశ్వర్ రెడ్డి కి మంత్రి కొండా సురేఖకి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి.
ఎటువంటి అధికార పదవులు లేని వ్యక్తిని స్టేజి మీదకి ఎలా పిలుస్తారు అని రాజేశ్వర్ రెడ్డి మంత్రిని నిలదీశారు. అలా పిలవడం పూర్తిగా ప్రోటోకాల్ ఉల్లంఘన కిందికి వస్తుందని రాజేశ్వర్ రెడ్డి వాదించారు. అయినా మంత్రి సురేఖ మాత్రం తనకు మంత్రిగా ప్రత్యేక అతిధులను పిలుచుకునే అధికారం ఉంటుంది అన్నారు. అక్కడే ఉన్న సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ని చూపిస్తూ కలెక్టర్ గారికి లేని అభ్యంతరం తనకు ఎందుకని రాజేశ్వర్ రెడ్డిని మంత్రి సురేఖ ఎదురు ప్రశ్నించారు. మీకు అసలు సమీక్ష సమావేశం జరగాలని ఉందా లేదా అని మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నట్టు అధికార సమీక్ష సమావేశాలు పెట్టుకుంటే, తాను అందులో పాల్గొనలేనని రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తనకు ఇష్టం ఉంటే ఉండాలని లేకుంటే వెళ్లొచ్చు అని మంత్రి సమాధానం ఇచ్చారు.
అయినా గుడి దగ్గర పెట్టాల్సిన సమావేశాన్ని సిద్దిపేటలో ఉన్న హరిత హోటల్ లో ఏర్పాటు చేయడమేంటని పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. సంప్రదాయాలకు, ఆచారాలకు వ్యతిరేకం మల్లన్న జాతరపై సిద్దిపేటలో సమావేశం పెట్టడం ఏంటని పల్లా ప్రశ్నించారు. శ్రీ మల్లికార్జున స్వామి గుడిలో దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారు. 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు సమావేశం హోటల్ లో పెట్టలేదని, ఈ సమావేశాన్ని తాను బహిష్కరించాలని అన్నారు. తర్వాత ఆ సమావేశం నుండి వాక్ అవుట్ చేశారు. ఇక ఇదంతా జరుగుతున్న కలెక్టర్ కానీ మిగతా అధికారులు కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. కొమ్ము ప్రతాపరెడ్డి కూడా డయాస్ మీటింగ్ మీద నుంచి దిగకుండా సమావేశం ముగిసే వరకు ఉన్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.