Telangana Village : విశ్వంలో ఎన్నో రకాల రహస్యాలు విశేషాలు దాగి ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని భూమండలంపై కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక అలాంటి వాటిని మనం చూసినప్పుడు కచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. అలాంటి వింత ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఉంది అంటే మీరు నమ్ముతారా..? అయితే ఇక్కడ జరిగే అద్భుతం వినడానికి అసాధ్యం అనిపిస్తుంది కానీ అక్కడ అదే నిజం. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే…
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో కొదురుపాక అనే గ్రామం ఉంది. అయితే ఆ గ్రామంలో పగల సమయం తక్కువగా రాత్రి సమయం ఎక్కువగా ఉంటుందట. అంటే భారత కాలమానానికి ఈ ప్రదేశం వ్యతిరేకంగా ఉంటుందని అర్థం. ఇదే ఆ గ్రామం యొక్క ప్రత్యేకత. అయితే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం పొదురుపాక గ్రామంలో ని ప్రజలందరూ భారతదేశంలోని ప్రజల మాదిరిగా కాకుండా ఉదయం 8 గంటల తర్వాత ఇంట్లో పనులు పూర్తిచేసుకుని హడావిడిగా బయటికి వెళ్తారు. ఇక సాయంత్రం 4 గంటల లోపే అన్ని పనులు ముగించుకుని ఇంటికి వచ్చేస్తారు. సాధారణంగా అయితే వ్యవసాయం చేసేవారు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పనిచేస్తూ ఉంటారు. కానీ ఈ పొదురుపాక గ్రామంలో మాత్రం 4 గంటలకే పని పూర్తి చేస్తారు..
అయితే సాధారణంగా ఉదయం పగలు సాయంత్రం రాత్రి అని ఇలా మనకు నాలుగు జాములు ఉంటాయి. కానీ కుదురుపాక గ్రామంలో మాత్రం మూడు జాములు మాత్రమే ఉంటాయి . అంటే ఆ ప్రాంతంలో నాలుగు గంటల తర్వాత చీకటి పడుతుంది. అంటే అక్కడ సాయంత్రం అనేది ఉండదు. అయితే ఆ ప్రదేశంలో ఇలా జరగడానికి గల కారణం భౌగోళిక పరిస్థితులే అని చెప్పవచ్చు.
అయితే కుదురుపాక గ్రామంలో సూర్యోదయం కూడా చాలా ఆలస్యంగా వస్తుంది. ఇక్కడ పగలు తక్కువగా రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ నివసించే గ్రామస్తులు కూడా దానికి తగ్గట్టుగానే భిన్నంగా ఉంటారు. అయితే భారత దేశమంతటా 6 నుంచి 6:30 గంటల మధ్యలో సూర్యోదయం జరిగితే కుదురుపాక గ్రామంలో మాత్రం ఉదయం 8 గంటలకు సూర్యోదయం వస్తుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకే చీకటి పడుతుంది. అందుకే అక్కడ ప్రజలు హడావుడిగా వారి పనులని ముగించుకుంటారు.
అయితే కుదురుపాక గ్రామంలో ఈ విధంగా జరగడానికి గల ముఖ్య కారణం ఆ గ్రామ భౌగోళిక పరిస్థితులు భిన్నంగా ఉండడం. ఎందుకంటే ఆ గ్రామం చుట్టూ కూడా 4 అతిపెద్ద గుట్టలు ఉన్నాయి. గ్రామానికి తూర్పున గొల్లగుట్ట , పడమర రంగనాయకుల గుట్ట , దక్షిణాన పాముబండగుట్ట , ఉత్తరాన నంబులాద్రి గుట్ట ఉన్నాయి. ఈ గ్రామం చుట్టూ ఉన్న ఈ గుట్టల కారణంగానే ఇక్కడ సూర్యోదయం మరియు సూర్యాస్తమయం భిన్నంగా జరుగుతూ ఉంటుంది. ఈ గ్రామానికి తూర్పున ఉన్న గొల్లగుట్ట కారణంగా ఉదయం 8 గంటల వరకు ఈ ప్రాంతమంతా చీకటిగానే ఉంటుంది. ఇక పడమర రంగనాయకుల గుట్ట ఉండడం వలన సూర్యాస్తమయం సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది. అంటే ఇక్కడ సాయంత్రం అనేది ఉండదన్నమాట. అందుకే ఈ ప్రాంతాన్ని మూడు జాముల గ్రామం అని కూడా పిలుస్తుంటారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.