New Ration Cards : హమ్మయ్య.. తెలంగాణ లో కొత్త రేషన్ కార్డులు వచ్చేసాయోచ్...!
New Ration Cards : ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన ఆధారంగా, అలాగే ‘మీ సేవ’లో దరఖాస్తు చేసిన వారి ఆధారంగా మళ్లీ సర్వేలు నిర్వహించి అర్హులను గుర్తించారు. ఈ ప్రక్రియలో రాజన్న జిల్లాలో 9,731 మంది తెల్ల రేషన్ కార్డులకు అర్హులుగా గుర్తించి జనవరి నెలలోనే మంజూరు చేశారు. అయితే మెల్‌సీ ఎన్నికల నియమావళి కారణంగా కార్డుల పంపిణీ ఆలస్యం కావడంతో మే నెల నుంచి బియ్యం పంపిణీ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జిల్లాలో పలు మండలాల్లో కుటుంబాలకు కార్డుల మంజూరుపై చర్యలు కొనసాగుతున్నాయి.
New Ration Cards : హమ్మయ్య.. తెలంగాణ లో కొత్త రేషన్ కార్డులు వచ్చేసాయోచ్…!
అయితే కొత్త కార్డులు మంజూరు అయినప్పటికీ, చేర్పులు మరియు మార్పులపై అయోమయం కొనసాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో కొత్త కార్డులు జారీ కాకపోవడం, పురాతన కార్డుల్లో సభ్యుల చేర్పు, మార్పులు జరగకపోవడం వల్ల ఇప్పటికీ 20,606 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పలు మండలాల్లో వెయ్యికి పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, కలెక్టరేట్ చుట్టూ ప్రజలు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మీ సేవ కేంద్రాల్లో మార్పులు ఇంకా ప్రతిబింబించకపోవడంతో అర్హులు మరోసారి నిరాశ చెందుతున్నారు.
ప్రభుత్వం త్వరలోనే ఈ రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా మార్చే యోచనలో ఉంది. ప్రస్తుతం రేషన్ పత్రాలను జిరాక్స్ చేసి ఉపయోగిస్తున్న తాత్కాలిక వ్యవస్థకు ముగింపు పలికేలా డిజిటల్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో మొత్తం 1,74,304 రేషన్ కార్డుల పరిధిలో 5,22,967 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో అంత్యోదయ, ఆహార భద్రత, అన్న యోజన కార్డులు కలిపి లక్షలాది మంది ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుతున్నాయి. కొత్త కార్డుల ద్వారా మరియు స్మార్ట్ కార్డుల రాకతో ప్రభుత్వం సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
This website uses cookies.