New Ration Cards : హమ్మయ్య.. తెలంగాణ లో కొత్త రేషన్ కార్డులు వచ్చేసాయోచ్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

New Ration Cards : హమ్మయ్య.. తెలంగాణ లో కొత్త రేషన్ కార్డులు వచ్చేసాయోచ్…!

 Authored By ramu | The Telugu News | Updated on :3 May 2025,5:00 pm

New Ration Cards : ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన కుల గణన ఆధారంగా, అలాగే ‘మీ సేవ’లో దరఖాస్తు చేసిన వారి ఆధారంగా మళ్లీ సర్వేలు నిర్వహించి అర్హులను గుర్తించారు. ఈ ప్రక్రియలో రాజన్న జిల్లాలో 9,731 మంది తెల్ల రేషన్‌ కార్డులకు అర్హులుగా గుర్తించి జనవరి నెలలోనే మంజూరు చేశారు. అయితే మెల్‌సీ ఎన్నికల నియమావళి కారణంగా కార్డుల పంపిణీ ఆలస్యం కావడంతో మే నెల నుంచి బియ్యం పంపిణీ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జిల్లాలో పలు మండలాల్లో కుటుంబాలకు కార్డుల మంజూరుపై చర్యలు కొనసాగుతున్నాయి.

New Ration Cards హమ్మయ్య తెలంగాణ లో కొత్త రేషన్ కార్డులు వచ్చేసాయోచ్

New Ration Cards : హమ్మయ్య.. తెలంగాణ లో కొత్త రేషన్ కార్డులు వచ్చేసాయోచ్…!

New Ration Cards : ఎట్టకేలకు ఎదురుచూపులు తెరపడింది.. తెలంగాణ లో కొత్త రేషన్‌ కార్డులు వచ్చేసాయి!

అయితే కొత్త కార్డులు మంజూరు అయినప్పటికీ, చేర్పులు మరియు మార్పులపై అయోమయం కొనసాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో కొత్త కార్డులు జారీ కాకపోవడం, పురాతన కార్డుల్లో సభ్యుల చేర్పు, మార్పులు జరగకపోవడం వల్ల ఇప్పటికీ 20,606 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పలు మండలాల్లో వెయ్యికి పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, కలెక్టరేట్‌ చుట్టూ ప్రజలు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మీ సేవ కేంద్రాల్లో మార్పులు ఇంకా ప్రతిబింబించకపోవడంతో అర్హులు మరోసారి నిరాశ చెందుతున్నారు.

ప్రభుత్వం త్వరలోనే ఈ రేషన్‌ కార్డులను స్మార్ట్‌ కార్డులుగా మార్చే యోచనలో ఉంది. ప్రస్తుతం రేషన్‌ పత్రాలను జిరాక్స్‌ చేసి ఉపయోగిస్తున్న తాత్కాలిక వ్యవస్థకు ముగింపు పలికేలా డిజిటల్‌ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో మొత్తం 1,74,304 రేషన్‌ కార్డుల పరిధిలో 5,22,967 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో అంత్యోదయ, ఆహార భద్రత, అన్న యోజన కార్డులు కలిపి లక్షలాది మంది ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుతున్నాయి. కొత్త కార్డుల ద్వారా మరియు స్మార్ట్ కార్డుల రాకతో ప్రభుత్వం సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది