New Ration Cards : నూతన రేషన్ కార్డుల పంపిణీపై సర్కార్ తాజా అప్‌డేట్..!
ప్రధానాంశాలు:
New Ration Cards : నూతన రేషన్ కార్డుల పంపిణీపై తెలంగాణ సర్కార్ తాజా అప్‌డేట్
New Ration Cards : తెలంగాణ Telangana ప్రజలు ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. రేషన్ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 26న లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, లబ్దిదారుల ఎంపిక, కార్డుల డిజైన్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వంటి అంశాలతో పంపిణీ వాయిదా పడుతూ వస్తోంది. సంక్రాంతికే రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించగా ఆ ప్రక్రియ మరోమారు వాయిదా పడింది.కాగా ఎన్నికలు ఉన్న జిల్లాలను మినహాయించి మిగతా జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలంటూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మార్చి 1న పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే పలు కారణాల వల్ల పంపిణీ ప్రక్రియ మొదలు కాకపోవడతో ఆశావాహ లబ్ధిదారులు నిరాశకు గురయ్యారు.

New Ration Cards : నూతన రేషన్ కార్డుల పంపిణీపై సర్కార్ తాజా అప్‌డేట్..!
New Ration Cards : ఉదాది నుంచి కొత్త రేషన్ కార్డులు…
ఈ నిరాశలను పారద్రోలేలా రేవంత్ సర్కార్ రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్త్ం ఫిక్స్ చేస్తూ తాజా అప్‌డేట్ ఇచ్చింది. తెలుగు సంవత్సరాది ఉగాది న నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ 31న ఉగాది ఉండడంతో అప్పటిలోగా రేషన్ కార్డుల ముద్రణ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
కొత్తగా పంపిణీ చేసే రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్‌తో పాటు, లైట్ బ్లూ కలర్‌లో ఉండనున్నట్టు తెలుస్తోంది. కార్డులపై ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, మరోవైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో కూడా ఉంటాయని సమాచారం. ప్రజాపాలన సమయంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులుగా ఎంపికైన లబ్ధిదారులకు ముందుగా కొత్తగా రేషన్ కార్డులు అందజేయనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మిగతావారికి దశల వారీగా ఈ కొత్త కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.