Categories: NewsTelangana

New Ration Cards : నూత‌న రేషన్ కార్డుల పంపిణీపై స‌ర్కార్ తాజా అప్‌డేట్‌..!

Advertisement
Advertisement

New Ration Cards  : తెలంగాణ Telangana ప్రజలు ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్య‌క్ర‌మం మ‌ళ్లీ వాయిదా ప‌డింది. రేషన్ కార్డుల పంపిణీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జనవరి 26న లాంఛ‌నంగా ప్రారంభించిన విష‌యం తెలిసిందే. దరఖాస్తుల స్వీక‌ర‌ణ‌, పరిశీలన, లబ్దిదారుల ఎంపిక, కార్డుల డిజైన్, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్‌ వంటి అంశాల‌తో పంపిణీ వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. సంక్రాంతికే రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించగా ఆ ప్ర‌క్రియ మ‌రోమారు వాయిదా పడింది.కాగా ఎన్నికలు ఉన్న జిల్లాలను మిన‌హాయించి మిగతా జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలంటూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో మార్చి 1న పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే పలు కారణాల వల్ల పంపిణీ ప్రక్రియ మొదలు కాకపోవడ‌తో ఆశావాహ ల‌బ్ధిదారులు నిరాశకు గురయ్యారు.

Advertisement

New Ration Cards : నూత‌న రేషన్ కార్డుల పంపిణీపై స‌ర్కార్ తాజా అప్‌డేట్‌..!

New Ration Cards : ఉదాది నుంచి కొత్త‌ రేషన్ కార్డులు…

ఈ నిరాశ‌ల‌ను పార‌ద్రోలేలా రేవంత్ సర్కార్ రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్త్ం ఫిక్స్ చేస్తూ తాజా అప్‌డేట్ ఇచ్చింది. తెలుగు సంవత్సరాది ఉగాది న నూత‌న రేష‌న్ కార్డులు పంపిణీ చేయాల‌ని సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ 31న‌ ఉగాది ఉండడంతో అప్పటిలోగా రేషన్ కార్డుల ముద్రణ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Advertisement

కొత్తగా పంపిణీ చేసే రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్‌తో పాటు, లైట్ బ్లూ కలర్‌లో ఉండనున్నట్టు తెలుస్తోంది. కార్డులపై ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, మరోవైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో కూడా ఉంటాయని సమాచారం. ప్రజాపాలన సమయంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులుగా ఎంపికైన లబ్ధిదారులకు ముందుగా కొత్తగా రేషన్ కార్డులు అందజేయనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మిగతావారికి దశల వారీగా ఈ కొత్త కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.

Advertisement

Recent Posts

Daily One Carrot : మీరు ప్రతి రోజు ఒక తాజా పచ్చి క్యారెట్ తిన్నారంటే… దీని ప్రయోజనాలు మతిపోగడతాయి…?

Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…

42 minutes ago

Toothpaste : ఇంకేంముంది టూత్ పేస్ట్ కూడా కల్తీనే… ప్రాణాలు తీసే లోహాలు… ఆ బ్రాండ్ లిస్ట్ తెలుసా…?

Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…

2 hours ago

TGSRTC Jobs : త్వరలో TGSRTC లో 3 వేల 38 పోస్టులకు నోటిఫికేషన్..!

TGSRTC Jobs  తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…

3 hours ago

Nutmeg Drink : కీళ్ల నొప్పులు ఉన్నోళ్లకి శుభవార్త…. మీకోసమే ఈ ఔషధం… దీనిని నీళ్లలో కలిపి తాగారంటే అవాక్కే…?

Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…

4 hours ago

Bhu Bharati : కొత్త ఫీచ‌ర్‌తో భూ భారతి.. ఏ మార్పు చేయాల‌న్న రైతు ఆమోదం త‌ప్ప‌ని స‌రి..!

Bhu Bharati  : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…

5 hours ago

Today Gold Price : ఏప్రిల్ 21న గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Today Gold Price  : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల…

6 hours ago

karthika deepam 2 Today Episode : దీపే కాల్చింద‌ని ఎస్ఐకు ద‌శ‌ర‌థ్ వాగ్మూలం.. మ‌రింత‌గా ఇరికించేందుకు జ్యోత్స్న మ‌రో ప్లాన్‌

karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…

7 hours ago

Sprouted Fenugreek : పరగడుపున మొలకెత్తిన మెంతులను తింటే… ఇన్ని రోజుల వరకు ఎంత మిస్ అయ్యాం .. ప్రయోజనాలు తెలుసా…?

Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…

8 hours ago