Big Breaking : రేషన్ కార్డు లేకుంటే రైతు బంధు కట్?.. షాక్‌లో తెలంగాణ రైతులు?
ప్రధానాంశాలు:
రైతు భరోసా కింద సంవత్సరానికి రూ.15 వేలు అందజేత
రేషన్ కార్డు ఉన్నవాళ్లకే దరఖాస్తుకు అవకాశం
జనవరి 6 న చివరి తేదీ
Rythu Bharosa Scheme : తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇవాళే సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీ హామీలను లాంచ్ చేయనున్నారు. రేపటి నుంచి అంటే.. డిసెంబర్ 28, 2023 నుంచి 6 జనవరి 2024 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆరు గ్యారెంటీ స్కీమ్స్ కు ఒకే దరఖాస్తు ఉంటుంది. ఇందులోనే రైతు బంధు కోసం కూడా మరోసారి రైతులు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ జత చేయాలని తెలిపారు. అంటే.. ఖచ్చితంగా మరోసారి రైతు బంధు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నా లేకున్నా.. ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధును అందించేది. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతు బంధు విషయంలో చాలా నిబంధనలు విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే రైతు బంధు వస్తున్న రైతులంతా.. ఆటోమెటిక్ గా రైతు భరోసా కింద ఆర్థిక సాయం పొందలేరు. వాళ్లు మళ్లీ ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి. రైతు భరోసా కింద రైతులంతా మళ్లీ డిసెంబర్ 28 నుంచి జనవరి 6, 2024 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రైతు భరోసా కింద దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు లేని వాళ్లు దరఖాస్తు చేసుకునే వీలు ఉండదు. అంటే రేషన్ కార్డు లేని వాళ్లకు వచ్చే సంవత్సరం నుంచి రైతు బంధు ఇచ్చే అవకాశం లేదు.
ఇప్పటికే గత 5 ఏళ్ల నుంచి వస్తున్న రైతు బంధు కోసం రేషన్ కార్డు లింక్ కొర్రీ పెడుతూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చెప్పడంతో 70 లక్షల మంది రైతులు ఆందోళనలో పడ్డారు. ఎందుకంటే.. రైతు బంధు వస్తున్న రైతుల్లో చాలామందికి రేషన్ కార్డులు లేవు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఆగిపోవడంతో చాలామంది రైతులు రేషన్ కార్డును తీసుకోలేకపోయారు. ఇప్పుడు రేషన్ కార్డు ఉంటేనే రైతు భరోసా కింద దరఖాస్తు చేసుకోవాలని కొత్త ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించడంతో ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.