BRS Party : బీఆర్ ఎస్ కు మరో దెబ్బ.. ఆ కీలక నేత అరెస్ట్ తప్పదా..?
BRS Party : బీఆర్ ఎస్ కు వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతోది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చింది. అప్పటి నుంచే బీఆర్ ఎస్ కు గడ్డు కాలం మొదలైంది. ఆ వెంటనే కేసీఆర్ కాలుజారి పడటం.. ఆయన కాలుకు ఆపరేషన కావడంతో ఇంటికే పరిమితం అయిపోయారు. ఇక సొంత కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ కావడం బీఆర్ ఎస్ ను కుదిపేసింది. దెబ్బకు బీఆర్ ఎస్ గ్రాఫ్ మొత్తం పడిపోతోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే బీఆర్ ఎస్ లీడర్లు అందరూ కాంగ్రెస్, బీజేపీ బాట పడుతున్నారు.
సిట్టింగ్ ఎంపీలు కొందరు అయితే టికెట్లు ఇస్తామన్నా సరే వద్దని మరీ కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్లిపోతున్నారు. ఇలా కూతురు ఢిల్లీ ఈడీ కస్టడీలో ఉండటం.. ఇటు పార్టీ నేతలు మొత్తం వెళ్లిపోతుండటంతో అసలు బీఆర్ ఎస్ వైభవం మొత్తం పోతోంది. భవిష్యత్ లో బీఆర్ ఎస్ మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకుంటుందా లేదా అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు బీఆర్ ఎస్ ను మరో అరెస్ట్ టెన్షన్ వెంటాడుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో కొందరు ఉన్నతాధికారులను అరెస్ట్ చేశారు.
ఇంకొందరు అరెస్ట్ అవుతామనే భయంతో దేశం వదిలేసి విదేశాలకు వెళ్లిపోతున్నారు. కాగా అసలు ఈ కేసులో ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఎవరనేది ఇప్పుడు కీలకంగా మారిపోయింది. అడిషనల్ ఎస్పీ హోదాలో ఉన్న భుజంగరావు.. తిరపతన్నలు అరెస్టు అయినప్పటి నుంచే ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు బయట పడుతున్నాయి. కాగా ఈ కేసులో గులాబీ పార్టీకి చెందిన ఓ కీలక నేత హస్తం ఉన్నట్టు గుర్తించారంట. ఈ విషయమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. వాస్తవానికి సదరు కీలక నేతను నిన్న ఆదివారమే అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది.
అతన్ని రాత్రి సమయంలో అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో చాలా టీవీ ఛానెళ్లు అరెస్ట్ కోసం ఎదురు చూశాయి. కానీ ఎందుకో అరెస్ట్ చేయలేదు. కానీ అతనిపై పూర్తి నిఘా పెట్టారని.. కేసులో అతని పాత్రకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించిన తర్వాత అరెస్ట్ తప్పదని అంటున్నారు. పైగా ఈ కేసులో రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారని.. దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే ఈ కేసులో గులాబీ నేత అరెస్ట్ తప్పదని అంటున్నారు.
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
This website uses cookies.