Women : పెళ్లి అనేది ప్రతి మనషి జీవితంలో ఎంతో కీలకం. ఎందుకంటే ఈ సృష్టిలో మానవ మనుగడకు పెళ్లి అనేది మూలం. అందుకే ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుని ముందుకు వెళ్లాలనేది సృష్టి ధర్మం. అనాధిగా వస్తున్న ఈ తతంగం ఇప్పటకీ కొనసాగుతుంది. అయితే పెళ్లి విషయంలో కూడా కొన్ని పథకాలు వస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో పెళ్లి చేసుకుంటే అమ్మాయిలకు మొన్నటి వరకు కల్యాణలక్ష్మీ కింద లక్ష రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెబుతోంది.
అయితే కొత్తగా పెళ్లి చేసుకునే వారికే ఈ పథకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు రెండో పెళ్లి విషయంలో కూడా ఇలాంటి ఓ పథకం తెస్తున్నారు. ఈ సమాజంలో చాలా మంది మహిళలు భర్తలకు దూరం అయిపోయి ఒంటరిగా బతుకుతున్నారు. భర్త వేధింపులు భరించలేక, భర్తతో బతకలేక విడాకులు తీసుకున్న వారు చాలామందే ఉన్నారు. ఇంకొందరు భర్త చనిపోతే ఒంటరిగా బతుకుతున్నారు. ఇలా ఒంటరిగా బతకండ ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ఇక పిల్లలు ఉంటే ఆ బతుకు మరింత భారం అవుతుందనే చెప్పుకోవాలి. అందుకే ఇలాంటి ఒంటరి మహిళల బతుకులను దృష్టిలో ఉంచుకుని వారికి రెండో పెళ్లని ప్రోత్సహించేందుకు ఝార్ఖండ్ ప్రభుత్వం కొత్త పథకం తెచ్చింది.
చాలా మంది రెండో పెళ్లి అంటే ఏదో పెద్ద తప్పుగా చూస్తారు. కానీ ఇప్పుడిప్పుడే సంప్రదాయాలను బద్దలు కొడుతూ రెండో పెళ్లి చేసుకుంటున్నారు చాలా మంది. కానీ ఇంచా చాలా చోట్ల రెండో పెళ్లి అంటే కొంత పెదవి విరుపు ఉంది. అందుకే ఇలాంటి సంకెళ్లను తెంచేసి రెండో పెళ్లితో ఒంటరి మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఝార్ఖండ్ ప్రభుత్వం విధ్వ పునర్వివాహ్ ప్రోత్సాహన్ యోజన అనే పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో వితంతువులను రెండో పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఝార్ఖండ్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలులోకి తెచ్చింది.
అంటే రెండో పెళ్లి చేసుకునే వారికి ఈ పథకం కింద రూ.2లక్షలు ఇస్తారు. కాగా దీనికి కావాల్సినవి ఏంటంటే.. మొదటి భర్త డెత్ సర్టిఫికెట్ తో పాటు రెండో పెళ్లికి సంబంధించిన మ్యారేజీ సర్టిఫికెట్. కాగా ఇందులో ఓ కండీషన్ కూడా పెట్టింది ప్రభుత్వం. అర్హులైన మహిళలు రెండో పెళ్లి అయిన మొదటి ఏడాదిలోపే ఈ సర్టిఫికెట్లను సమర్పించాలి. అప్పుడే లబ్ది చేకూరుతుంది. అంతే కాకుండా పెన్షన్లు తీసుకునేవారు. ప్రభుత్వ ఉదయోగులు, ఆదాయ పన్ను కట్టే వారు ఈ పథకానికి అనర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. మరి ప్రభుత్వం తెచ్చిన ఈ పథకంపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.