pm modi and pawan kalyan public meeting
PM Modi : గిరిజన బిడ్డను రాష్ట్రపతిని ఎలా చేశామో.. తెలంగాణలో కూడా బీసీ ముఖ్యమంత్రిని చేసి తీరుతామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభ జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ కీలక నేతలు హాజరయిన ఈ సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ.. తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీలదే రాజ్యాధికారం అని స్పష్టం చేశారు. బీసీ ఆత్మ గౌరవ సభలో భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే గ్రౌండ్ లో నన్ను ప్రజలు ఆశీర్వదించారు. అందుకే నేను ప్రధానిని అయ్యాను. అందుకే.. 2023 లో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలి అనే నిర్ణయం ఇక్కడి నుంచే జరగాలి. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ బీసీలను ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేదు అని ప్రధాని ప్రశ్నించారు.
గత తొమ్మిదేళ్ల నుంచి తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక పాలన సాగుతోంది. అందుకే అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలంటే ఈ సర్కార్ కు బుద్ధి చెప్పాలి. ఈ నవంబర్ 30న మీరంతా అదే పని చేయాలి. కానీ.. తమ ప్రభుత్వం మాత్రం దళితులకు, ఆదివాసీలకు ప్రాధాన్యత ఇస్తోంది. రామ్ నాథ్ గోవింద్ ను ప్రెసిడెంట్ చేశాం.. ఆ తర్వాత గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేశాం. కేంద్ర కేబినేట్ లో బీసీలు 27 మంది ఉన్నారు. ఓబీసీలకు అన్ని చోట్ల రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ఒక్కటే. కొడుకు కోసం, బిడ్డ కోసం మాత్రమే ఈ పార్టీలు పని చేస్తాయి. తెలంగాణలో ఎంఐఎం, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరుగుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన ఉద్యమం. కానీ.. కేసీఆర్ వచ్చి తెలంగాణను నిండా ముంచేశారు అంటూ ప్రధాని మండిపడ్డారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగింది. నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా అన్నదే ప్రశ్న. దేశ ప్రయోజనాలే ప్రధాని మోదీని నిర్దేశిస్తాయి. ఎన్నికల ప్రయోజనాలు కాదు. బీసీలను సీఎం చేస్తామని చెప్పిన పార్టీ బీజేపీ. అంతర్జాతీయంగా భారత్ ను అగ్రగామిగా నిలబెట్టింది మోదీనే. ప్రతి భారతీయుడి గుండెలో ధైర్యం నింపిన నేత ప్రధాని మోదీ.. అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
This website uses cookies.