Rashmika Mandanna : రష్మిక మందన్న ఫేక్ వీడియో వెనక ఎవరున్నారో తెలిసిపోయింది .. మొత్తం ఆమెనే చేసింది..!
Rashmika Mandanna : ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మిక మందన్న కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. రష్మిక ఫేస్ ని మార్ఫింగ్ చేసి, ఎద అందాలను చాలా దారుణంగా ప్రదర్శించినట్లుగా ఈ వీడియోలో కనిపిస్తుంది. బ్లాక్ కలర్ డ్రెస్ లో అసభ్యకరంగా ఎక్స్ పోజింగ్ తో లిఫ్ట్ లోకి వెళుతున్నట్లు ఈ వీడియోలో చూపించారు. మొదట అందరూ ఈ వీడియోలో ఉంది రష్మికనే అనుకున్నారు కానీ నిశితంగా పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. ఈ వీడియోలో అసలు ఎవరు ఉన్నదో తాజాగా బయటకి వచ్చింది. ఈ వీడియోలో ఉన్న ఆమె పేరు జరా పటేల్. ఆంగ్లో ఇండియన్ అయినా జరా పటేల్ ప్రముఖ కంపెనీలో డేటా ఇంజనీర్గా పనిచేస్తున్నారు.
ఆమె రెండు ఇంస్టాగ్రామ్ అకౌంట్ ల ను మెయింటైన్ చేస్తున్నారు. అందులో ఒక ఎకౌంట్లో ఫాలోవర్స్ కోసం అడల్ట్ కంటెంట్ ను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ అకౌంట్లో తన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఆమెకు నాలుగు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆమె అక్టోబర్ 9న తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోని షేర్ చేశారు. ఆ వీడియో కి రష్మిక మందన ఫేస్ ను మార్ఫింగ్ చేసి నెట్టింటా షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడం, ఇందులో ఉంది రష్మిక కాదని తెలిసింది.
దీంతో ఈ వీడియో పై సినీ రాజకీయ ప్రముఖులు స్పందించారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అమితాబచ్చన్ , కల్వకుంట్ల కవిత , కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, సాయి ధరమ్ తేజ్, నాగచైతన్య ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘటనను మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలని కోరుకుంటూ రష్మికకు అండగా నిలిచారు. ఇక ఫేస్ మార్ఫింగ్ చేసిన వీడియో పై రష్మిక కూడా స్పందించారు. ఈ వీడియో తనను చాలా బాధించిందని చెప్పుకొచ్చారు. ఈ ఫేక్ వీడియో గురించి మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు. అది నాకు ఎంత మాత్రం భయం కాదని ఆమె తెలిపారు. తనకు మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు అంటూ రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.