Categories: NewsTelangana

Raj Gopal Reddy : రేవంత్ పై స్వరం పెంచిన రాజగోపాల్.. అసలు వార్ మొదలుకాబోతుందా..?

Raj Gopal Reddy  : తెలంగాణ Telangana CM Revanth reddy సీఎం రేవంత్ రెడ్డి “రాబోయే పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగతాను” అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తిగత స్వార్థాలకు విరుద్ధంగా పార్టీని ఒకరిపై కేంద్రీకరించటం సరైందికాదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ విలువలు, ప్రజాస్వామ్య విధానాలకు ఇది వ్యతిరేకమని ట్విట్టర్ వేదికగా ఆయన మండిపడ్డారు.

Raj Gopal Reddy : రేవంత్ పై స్వరం పెంచిన రాజగోపాల్.. అసలు వార్ మొదలుకాబోతుందా..?

Raj Gopal Reddy  రేవంత్ పై రాజగోపాల్ ఫైర్.. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు దేనికి సంకేతం?

ఇదే సమయంలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కోమటిరెడ్డి.. ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, “తన దారి తాను చూసుకుంటా” అన్న వ్యాఖ్య చేయడం వంటి పరిణామాలు ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ అసంతృప్తిని ప్రదర్శిస్తున్నాయి. రేవంత్ రెడ్డి తన బహిరంగ ప్రసంగాల్లో తరచూ తానే మరోసారి సీఎం అవుతానంటూ చెప్పడం, ప్రత్యేకించి “2024 నుంచి 2034 వరకూ పాలమూరు బిడ్డ సీఎం అవుతాడు” అన్న వాఖ్యలు పార్టీలోని సీనియర్ నేతల్లో అసహనానికి కారణమవుతున్నాయి. ఇది పార్టీలో పలు వర్గీకరణలకు, లోపలి సంఘర్షణలకు బీజం వేస్తోందని విశ్లేషకుల అభిప్రాయం.

ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌ అధిష్ఠానం జోక్యం చేసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పునరుద్ధారానికి ఇది కీలక సమయం. ఇటువంటి మాటలతో వర్గీయ విభేదాలు పెరిగితే, అధికారంలో ఉన్న పార్టీకి అది ముప్పుగా మారే అవకాశముంది. రేవంత్ రెడ్డి నాయకత్వంపై సవాళ్లు పెరుగుతున్న వేళ, పార్టీలో ఏకత్వాన్ని పునరుద్ధరించడంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కోమటిరెడ్డి తదుపరి రాజకీయ అడుగు ఏదై ఉంటుందోనన్న ఉత్కంఠ కాంగ్రెస్ శ్రేణుల్లోనూ, పర్యవేక్షకుల్లోనూ మొదలైంది.

Recent Posts

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

2 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

3 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

3 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

5 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

6 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

7 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

8 hours ago

Dizziness causes symptoms | ఆక‌స్మాత్తుగా త‌ల తిరుగుతుందా.. అయితే మిమ్మ‌ల్ని ఈ వ్యాధులు వెంటాడుతున్న‌ట్టే..!

Dizziness causes symptoms |  చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…

8 hours ago