Rs 500 Gas Cylinder : తెలంగాణలో కేవలం వీరికే రూ.500లకు గ్యాస్ సిలిండర్..?
ప్రధానాంశాలు:
రేషన్ కార్డు ఉన్న వాళ్లకే 500 గ్యాస్ సిలిండర్
తెలంగాణలో మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు
రేషన్ కార్డులు ఉన్న వాళ్ల గ్యాస్ కనెక్షన్లు 85.79 లక్షలు
Rs 500 Gas Cylinder : తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే అభయ హస్తం హామీపై తొలి సంతకం చేశారు. అందులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద వెంటనే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణాన్ని అందిస్తున్నారు. ఆ స్కీమ్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇక.. ఆ తర్వాత 500 కే గ్యాస్ సిలిండర్ స్కీమ్ పై కూడా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో మహాలక్ష్మీ స్కీమ్ కింద తెలంగాణలోని ఆడపడుచులకు కేవలం 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఆయన ఇచ్చిన హామీ మేరకు ఆ హామీని అమలు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణలో మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో రేషన్ కార్డులు ఉన్న వాళ్ల గ్యాస్ కనెక్షన్లు 85.79 లక్షలు. అయితే.. రేషన్ కార్డుతో గ్యాస్ కనెక్షన్లు లింక్ చేయగా 63.6 లక్షల కనెక్షన్లు ఉన్నట్టు లెక్క తేలింది. కేవలం గ్యాస్ కనెక్షన్ తో రేషన్ కార్డును లింక్ చేసుకున్న వినియోగదారులకే రూ.500 కు గ్యాస్ సిలిండర్ ను ప్రభుత్వం అందించనుంది. అయితే.. వీళ్లకు సంవత్సరానికి లిమిటెడ్ గానే సిలిండర్లు అందిస్తారు. సంవత్సరానికి 6 లేదంటే 12 సిలిండర్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలను రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్టు తెలుస్తోంది.