Ration Card : తెలంగాణలోని Telangana రేషన్ కార్డు లబ్ధిదారులకు రేవంత్ Revanth reddy Govt సర్కార్ శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది నుంచి రేషన్ Ration Card లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి రాష్ట్రంలో సన్న బియ్యం పథకం ప్రారంభమవుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో 80-85 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతోందని చెప్పారు. అందులో 36 లక్షల టన్నులు పీడీఎస్‌కు వచ్చినా సరిపోతుందన్నారు.
నెలకు 2 లక్షల టన్నుల చొప్పున సన్న బియ్యం పేదలకు పంపిణీ చేస్తామని మంత్రి వివరించారు. ప్రస్తుతం అంగన్‌వాడీ సెంటర్లు, కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సన్నబియ్యం పంపిణీ జరుగుతుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి సాధారణ ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో సన్నబియ్యం మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రేషన్ డీలర్ల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరగుతోందని చెప్పారు. ఈ సర్వేతో పాటుగా ధాన్యం సేకరణ పూర్తయిన తర్వాత.. తెల్లరేషన్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సన్నబియ్యం ధర ఎక్కువ కాబట్టి.. రైతులు భారీ ఎత్తున పండించి.. ఎక్కువ ఆదాయం పొందినట్లైంది. అలాగే మద్దతు ధర కంటే రూ.500 ఎక్కువగా బోనస్ కూడా పొందారు. ఇకపై కూడా రైతులు సన్నబియ్యమే పండించే అవకాశాలు ఉన్నాయి. ఈ బియ్యాన్ని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు కాబట్టి.. రైతులకు అన్ని రకాలుగా మేలు జరగనుందని ఆయన తెలిపారు.
Belly Fat : ప్రస్తుత కాలంలో ఎంతోమంది తమ ఆరోగ్యం కోసం యోగాసనాలు చేస్తున్నారు. అయితే ఈ యోగాలో ఎన్నో…
Bharat Brand : అధిక ధరల నుండి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు భారత ప్రభుత్వం 2వ దశ గోధుమ పిండి…
Dry Apricots : మన ఆరోగ్యం కోసం ప్రతి రోజు ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాం. అయితే వాటిల్లో ఆప్రికాట్…
Coriander Leaves : కొత్తిమీరను ఎన్నో రకాల వంటకాలలో వాడతాం. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఏ…
Business Idea : ఇటీవలి సంవత్సరాలలో సిమెంట్ ఇటుకల వ్యాపారం సానుకూల ఫలితాలను సాధిస్తుంది. సిమెంట్ ఇటుకలు పెరుగుతున్న గ్రీన్…
Saneswara : నవంబర్ 15వ తేదీన న్యాయదేవుడైన శనీశ్వరుడు తిరోగమన దశ నుంచి సాధారణ స్థితిలోకి రాబోతున్నాడు. అయితే కర్మలను…
DRDOలో జె.ఆర్.ఎఫ్ పోస్ట్ కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. నెలకు 37000 వరకు స్టైఫెండ్ తో ఈ జాబ్స్ ఇస్తున్నారు. భారత…
God Rings : నేటి ఆధునిక కాలంలో చాలామంది మెడలో వేసుకునే హారాలకు చైన్స్ కి నెక్లెస్ లకి మరియు…
This website uses cookies.