Ration Card : రేషన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ
ప్రధానాంశాలు:
Ration Card : రేషన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ
Ration Card : తెలంగాణలోని Telangana రేషన్ కార్డు లబ్ధిదారులకు రేవంత్ Revanth reddy Govt సర్కార్ శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది నుంచి రేషన్ Ration Card లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి రాష్ట్రంలో సన్న బియ్యం పథకం ప్రారంభమవుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో 80-85 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతోందని చెప్పారు. అందులో 36 లక్షల టన్నులు పీడీఎస్‌కు వచ్చినా సరిపోతుందన్నారు.
నెలకు 2 లక్షల టన్నుల చొప్పున సన్న బియ్యం పేదలకు పంపిణీ చేస్తామని మంత్రి వివరించారు. ప్రస్తుతం అంగన్‌వాడీ సెంటర్లు, కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సన్నబియ్యం పంపిణీ జరుగుతుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి సాధారణ ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో సన్నబియ్యం మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రేషన్ డీలర్ల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరగుతోందని చెప్పారు. ఈ సర్వేతో పాటుగా ధాన్యం సేకరణ పూర్తయిన తర్వాత.. తెల్లరేషన్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సన్నబియ్యం ధర ఎక్కువ కాబట్టి.. రైతులు భారీ ఎత్తున పండించి.. ఎక్కువ ఆదాయం పొందినట్లైంది. అలాగే మద్దతు ధర కంటే రూ.500 ఎక్కువగా బోనస్ కూడా పొందారు. ఇకపై కూడా రైతులు సన్నబియ్యమే పండించే అవకాశాలు ఉన్నాయి. ఈ బియ్యాన్ని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు కాబట్టి.. రైతులకు అన్ని రకాలుగా మేలు జరగనుందని ఆయన తెలిపారు.