Cabinet Expansion : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ అధిష్టానంతో మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరుపుతున్నామని.. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రజాపాలన పట్ల 50 శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ ఏడాది పాలన పూర్తయింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ ఆలోచన చేస్తున్నారు. ఇందు కోసం పాలనా పరంగా నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. పార్టీ పరంగా నిర్ణయాల పైన ఫోకస్ చేసారు. అందు లో భాగంగా మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పదవుల పైన ఈ సారి పర్యటనలో ఖరారు చేసేలా హైకమాండ్ తో చర్చిస్తున్నట్టు సమాచారం.
గ్రేటర్ హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లాల పైన ప్రత్యేకంగా కసరత్తు కొన సాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తనకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని లేఖ రాసారు. ఈ సారి విస్తరణ పైన చర్చ ఖాయమని భావించిన ఆశావాహులు ఢిల్లీలో మకాం వేసారు. మల్ రెడ్డి రంగారెడ్డి, మదన్ మోహన్ రావు, వాకిటి శ్రీహరి, గడ్డం బ్రదర్స్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు పేర్లు ప్రధానంగా రేసులో ఉన్నట్టుగా అర్ధమవుతుంది. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఉత్తమ్ .. కోమటిరెడ్డి వెంకట రెడ్డి మంత్రులుగా ఉన్నారు. కాగా, తనకు ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారు. ముదిరాజ్ వర్గానికి మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. అదే విధంగా సీఎం రేవంత్ వద్ద ఉన్న విద్య, హోం, మున్సిపల్ శాఖల కేటాయింపు పైన రేవంత్ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. వీలైనంత త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
ఇక మంత్రి వర్గ విస్తరణలో అధిష్టానందే ఫైనల్ అని కూడా భట్టి విక్రమార్క అన్నారు. వందశాతం మంది ప్రభుత్వం పాలన పట్ల సంతోషంగా ఉంటారనుకోవడం లేదని చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందని చెప్పారు. హైడ్రాకు ధనిక, పేద అన్న తేడా లేదని స్పష్టం చేశారు. ఎవరు చెరువులను ఆక్రమించిన వారిపై హైడ్రా చర్యలు తీసుకుంటుందని తేల్చిచెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపట్టబోతున్నామని తెలిపారు. రైతు భరోసాను సంక్రాంతి నుంచి అమలుచేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించామని అన్నారు. రైతులకు ఇచ్చే బోనస్‌లో రైతు భరోసా, రుణమాఫీ కన్నా ఎక్కువ లబ్ధి రైతులకు చేకూర్చుతుందని మల్లు భట్టి విక్రమార్క వివరించారు.
Mahesh Rajamouli Movie : సూపర్ స్టర్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు…
Health Tips: ఇప్పుడున్న సమాజంలో అనేక టెన్షన్స్, ఒత్తిడిలు,ఎక్కువైపోయాయి. మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. ఎందుకంటే బిజీ లైఫ్ లో డబ్బు…
IRCTC : దేశం యొక్క రవాణా వ్యవస్థకు వెన్నెముక అయిన భారతీయ రైల్వేలు దాని విస్తృతమైన నెట్వర్క్తో ప్రతిరోజూ మిలియన్ల…
Allu Arjun : తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సినీ నటుడు అల్లు అర్జున్ శనివారం ఉదయం హైదరాబాద్…
పుష్ప 2 తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ని 12 గంటల పాటు అరెస్ట్…
Tirupati Laddu : లడ్డూ వివాదం నేపథ్యంలో ఆలయ వంటశాలను పరిశీలించేందుకు ఆరుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)…
House : జీవన ప్రపంచం వేగంగా మారుతోంది. ఎక్కువ ఖర్చు లేకుండా మీ కలల ఇంటిని నిర్మించడం గురించి ఆలోచిస్తున్నారా?…
Allu Arjun Lawyer : డిసెంబర్ 4 న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్లో జరిగిన…
This website uses cookies.