Cabinet Expansion : కేబినెట్ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో బిగ్ ట్విస్ట్.. రేవంత్ ఏం చేయ‌బోతున్నారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cabinet Expansion : కేబినెట్ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో బిగ్ ట్విస్ట్.. రేవంత్ ఏం చేయ‌బోతున్నారు..!

 Authored By ramu | The Telugu News | Updated on :13 December 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Cabinet Expansion : కేబినెట్ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో బిగ్ ట్విస్ట్.. రేవంత్ ఏం చేయ‌బోతున్నారు..!

Cabinet Expansion : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ అధిష్టానంతో మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరుపుతున్నామని.. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రజాపాలన పట్ల 50 శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ ఏడాది పాలన పూర్తయింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ ఆలోచన చేస్తున్నారు. ఇందు కోసం పాలనా పరంగా నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. పార్టీ పరంగా నిర్ణయాల పైన ఫోకస్ చేసారు. అందు లో భాగంగా మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పదవుల పైన ఈ సారి పర్యటనలో ఖరారు చేసేలా హైకమాండ్ తో చ‌ర్చిస్తున్న‌ట్టు స‌మాచారం.

Cabinet Expansion కేబినెట్ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో బిగ్ ట్విస్ట్ రేవంత్ ఏం చేయ‌బోతున్నారు

Cabinet Expansion : కేబినెట్ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో బిగ్ ట్విస్ట్.. రేవంత్ ఏం చేయ‌బోతున్నారు..!

Cabinet Expansion కొత్త మంత్రులు..

గ్రేటర్ హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లాల పైన ప్రత్యేకంగా కసరత్తు కొన సాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తనకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని లేఖ రాసారు. ఈ సారి విస్తరణ పైన చర్చ ఖాయమని భావించిన ఆశావాహులు ఢిల్లీలో మకాం వేసారు. మల్ రెడ్డి రంగారెడ్డి, మదన్ మోహన్ రావు, వాకిటి శ్రీహరి, గడ్డం బ్రదర్స్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు పేర్లు ప్రధానంగా రేసులో ఉన్నట్టుగా అర్ధ‌మ‌వుతుంది. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఉత్తమ్ .. కోమటిరెడ్డి వెంకట రెడ్డి మంత్రులుగా ఉన్నారు. కాగా, తనకు ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారు. ముదిరాజ్ వర్గానికి మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. అదే విధంగా సీఎం రేవంత్ వద్ద ఉన్న విద్య, హోం, మున్సిపల్ శాఖల కేటాయింపు పైన రేవంత్ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. వీలైనంత త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.

ఇక మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో అధిష్టానందే ఫైన‌ల్ అని కూడా భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. వందశాతం మంది ప్రభుత్వం పాలన పట్ల సంతోషంగా ఉంటారనుకోవడం లేదని చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందని చెప్పారు. హైడ్రాకు ధనిక, పేద అన్న తేడా లేదని స్పష్టం చేశారు. ఎవరు చెరువులను ఆక్రమించిన వారిపై హైడ్రా చర్యలు తీసుకుంటుందని తేల్చిచెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపట్టబోతున్నామని తెలిపారు. రైతు భరోసాను సంక్రాంతి నుంచి అమలుచేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించామని అన్నారు. రైతులకు ఇచ్చే బోనస్‌లో రైతు భరోసా, రుణమాఫీ కన్నా ఎక్కువ లబ్ధి రైతులకు చేకూర్చుతుందని మల్లు భట్టి విక్రమార్క వివరించారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది