
Revanth Reddy : డ్రగ్స్‌పై కూడా రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతున్నారా.. హైడ్రాతో ఫుడ్ సేఫ్టీ కూడా హడల్..!
Revanth Reddy : తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తమదైన శైలిలో దూసుకుపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పీఠం అధిరోహించగా, ఆయన తన మార్క్ చూపిస్తున్నారు. బాధ్యతలు చేపట్టినప్పటి అన్ని రంగాల బలోపేతం దిశగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి, మహా నగరంలో ప్రధాన సమస్యగా మారిన విపత్తుల నిర్వహణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందుకోసం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్) అనే ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్ బోర్డు, సిటీ ట్రాఫిక్, వివిధ విభాగాల నుంచి ప్రత్యేక బృందాలు ఈ విభాగంలో ఉంటాయి.
అయితే గండిపేట జలాశయాన్ని కేంద్ర మాజీ మంత్రి పది ఎకరాలు కబ్బా చేయడంతో అందరు అవాక్కయ్యారు. గత ఆదివారం గండిపేట, హిమాయత్ సాగర్ జంట జలాశయాల పరిధిలో ఆక్రమణలకు పాల్పడ్డ పది నిర్మాణాలను కూల్చివేశారంటే ఆశ్చర్యం కలగక మానదు. అయితే హైడ్రాపై కొందరు కోర్టుకు కూడా వెళుతున్నారంటే ఆ సంస్థ దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైడ్రా.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అనేది సీఎం రేంత్ మానస పుత్రిక. దీని అధికారాల పరిధి కూడా ఎక్కువే. హైదరాబాద్ ను విశ్వ నగరంగా నిలిపే ఉద్దేశంలో హైడ్రాను తీసుకొచ్చారు రేవంత్.
Revanth Reddy : డ్రగ్స్‌పై కూడా రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతున్నారా.. హైడ్రాతో ఫుడ్ సేఫ్టీ కూడా హడల్..!
డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి అనే మాటే వినపడేందుకు వీల్లేదన్న సీఎం రేవంత్ ఆదేశాల మేరకు పోలీసులు, టీఎస్ న్యాబ్ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే హైదరాబాద్ పబ్ లపై వరుసగా దాడులు చేస్తున్నారు. కీలకంగా వ్యవహరిస్తున్న డీజే (డిస్క జాకీ)లనూ పట్టుకుని లోపలేశారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తూ పోలీసులు తనిఖీలు, దాడులు చేస్తున్నారు. బిర్యానీలను విక్రయించే రెస్టారెంట్లు ప్రమాణాలు పాటించడం లేదు. అన్నీ రెస్టారెంట్లు, హోటళ్లు కాకున్నా.. పేరున్న కొన్ని నాసిరకం నూనెలు, ఫ్రిజ్ లో ఉంచిన చికెన్, మటన్ వినియోగిస్తున్నట్లు తెలియడంతో వాటిపై ఉక్కుపాదం మోపే అవకాశం ఉంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.