Ys sharmila : తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అన్నాచెల్లెలు అంటే మొదటగా గుర్తుకొచ్చేది కేటీఆర్, కవిత. ఆ తర్వాత వైఎస్ జగన్, షర్మిల గుర్తుకు వస్తారు. ఐదేళ్ల కిందటి వరకు జగన్, షర్మిల అన్యోన్యంగా ఉండేవారు. ఎంతో ప్రేమానురాగాలతో.. వివాహాలు జరిగి వేర్వేరు కుటుంబాలుగా మారినా తరచూ కలుస్తూ అందరికి ఆదర్శంగా ఉండేవారు. తాడేపల్లిలోని నివాసంలోనే జగన్, షర్మిల ఉండేవారు. షర్మిలను కన్న తండ్రి మాదిరి జగన్ చూసుకునేవారు. ఇదే విషయాన్ని షర్మిల చాలాసార్లు బహిరంగ వేదికల్లో చెప్పారు. ‘జగనన్న నన్ను పెద్దకూతురిలా చూసుకుంటారు. ఆయన నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు’ అని చాలా ఇంటర్వ్యూల్లో షర్మిల చెప్పారు. షర్మిల కూడా జగనన్నతో ప్రేమగా.. అంతేకాకుండా అన్న కష్టాల్లోనూ తోడుగా నిలిచారు.
కొన్ని కేసుల్లో అరెస్టయ్యి జైల్లో ఉంటే జగనన్నకు అండగా షర్మిల రాజకీయ బాధ్యతలను చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను షర్మిల విజయవంతంగా చేపట్టారు. తన తండ్రి వైఎస్సార్, అన్న జగన్ మాదిరి షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఇలా అన్న కష్టసుఖాల్లో పాలుపంచుకున్న షర్మిల ఐదేళ్ల కిందట అనూహ్యంగా అన్న నుంచి దూరమయ్యారు. అధికారంలోకి వచ్చాక జగన్‌తో షర్మిలకు భేదాభిప్రాయాలు వచ్చాయి. అనంతరం తెలంగాణలోకి ప్రవేశించి షర్మిల కొత్త పార్టీ పెట్టుకుని విఫలమయ్యారు. అయితే ఆమె తాజాగా జగన్‌ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. విశాఖలోని అచ్యుతాపురం సెజ్‌లో 17 మంది కార్మికుల మరణాలకు, క్షతగాత్రులకు కారణమైన ఎసెన్షియా ఫార్మా కంపెనీని సీజ్ చేసి చర్యలు తీసుకోవాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ట్వీట్ చేశారు. ఇటువంటి దారుణాలు, మరీ ముఖ్యంగా విశాఖ పరిసరాల్లో మరోసారి జరగకుండా ఆకస్మిక తనిఖీల ద్వారా నియంత్రణకు పూనుకోవాలని సూచించారు.
సెజ్‌లో భద్రతా పట్ల నిర్లక్ష్యం కనిపించినా వెంటనే ఆ ప్లాంట్లు మూసివేయాలని కోరారు. కంపెనీ నిర్వాహకాలు, ప్రమాదాలపై ఓ సంస్థ నాటి వైసీపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, అయితే ప్రభుత్వం నివేదికపై మౌనం వహించిందని ఆమె ఆరోపించారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నుంచి ఏమి నేర్చుకోకుండా రిషి కొండను పిండిచేసి రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టుకునేందుకు డబ్బు, తీరిక ఉంటుంది. కాని కార్మికుల ప్రాణాల రక్షణకు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆక్రోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం షర్మిళ ట్వీట్ వైరల్ అవుతుంది.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.