Revanth Reddy : తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పనులు చకా చకా చేసుకుంటూ వెళుతుంది. ప్రస్తుతం కేబినెట్‌లో సీఎంతో కలుపుకుని 12 మంది మంత్రులు ఉండగా.. మరో ఆరు బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో ఈ ఆరు మంత్రి పదవులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. కొంత కాలంగా మంత్రివర్గ విస్తరణ పైన చర్చలు జరుగుతున్నాయి. తాజాగా పార్టీ అధినాయకత్వం మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నూతన పీసీసీ చీఫ్..మంత్రివర్గ విస్తరణ..నామినేటెడ్ పదవులను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పుడు కొత్తగా రేవంత్ టీంలోకి ఆరుగురు రానున్నారు.
నలుగురిని మాత్రమే ప్రస్తుతానికి ఎంపిక చేసినట్లు సమాచారం. గ్రేటర్ ఎన్నికలను పరిగణలోకి తీసుకొని మంత్రి పదవుల రేసులో నల్లగొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్ మంత్రిపదవులకు పోటీ పడే అవకాశః ఉందని అంటున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎస్టీని నియమిస్తే బాలూనాయక్‌ను డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది. బీసీ, ఎస్సీ వర్గాల నుంచి టీపీసీసీ చీఫ్‌ను ఎంపిక చేస్తే.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు బాలూనాయక్ కూడా మంత్రి పదవి దక్కించుకునే అవకాశం ఉ ంది.
ఇక బీసీ కమిషన్ చైర్మన్ పోస్టును మున్నూరుకాపు సామాజిక వర్గానికి కేటాయించే ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో బీసీ కమిషన్ చైర్మన్ పదవికి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు వి. హన్మంతరావు, గోపిశెట్టి నిరంజన్ లో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని అంటున్నారు. రైతు, విద్యా కమిషన్ చైర్మన్లుగా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి పేర్లు ఖరారైనట్లు సమాచారం. అధిష్టానం దీనిపై మరో రెండు రోజులలో క్లారిటీ ఇవ్వనుందని తెలుస్తుండగా, ఆ తర్వాత అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.