Revanth Reddy : జగన్ ఫార్ములాతో రేవంత్ రెడ్డి సరికొత్త రాజకీయం.. త్వరలో గ్రామాల్లో కొత్త వ్యవస్థ..!
Revanth Reddy : తెలంగాణలో ఊహించని విధంగా గెలుపొంది ఇప్పుడు అనేక కొత్త కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అసెంబ్లీలో సత్తా చాటిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అదే రిజల్ట్ రిపీట్ చేయాలని భావిస్తోంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించటమే కాకుండా, సరికొత్త ఎత్తుగడలు వేస్తూ ఓటర్స్‌ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల సమీక్ష సమావేశానికి హాజరైన సీఎం నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో సీఎం జగన్ అమలు చేస్తున్న వాలంటీర్ల విధానం తరహాలో తెలంగాణలోనూ ఓ కొత్త వ్యవస్థను తీసుకొస్తామని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారడం మనం చూశాం.
ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి తప్పించటంతో రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. ఇప్పుడు ఏపీలో గెలిచేందుకు ఇటు జగన్, అటు చంద్రబాబు వాలంటీర్లకు హామీలు గుప్పిస్తున్నారు. ప్రజలకు చేరువ అయిన వాలంటీర్లను ఓన్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థకి మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు దీనిని కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత దాదాపు 36,000 మంది వాలంటీర్లను నియమించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పార్టీ నేతలతో తన ప్రణాళికలను పంచుకున్నట్లు తెలుస్తోంది.
Revanth Reddy : జగన్ ఫార్ములాతో రేవంత్ రెడ్డి సరికొత్త రాజకీయం.. త్వరలో గ్రామాల్లో కొత్త వ్యవస్థ..!
ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణలో అనేక పథకాలు అమలవుతుండగా, ఆ పథకాలని ప్రజలకి మరింత చేరవేసేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బాగా పనిచేసిన కార్యకర్తలను గుర్తించి.. ఇందిరమ్మ కమిటీల్లో నియమిస్తామని చెప్పారు. వారికి ప్రభుత్వం నుంచి రూ. 6 వేల చొప్పున గౌరవ వేతనం కూడా ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించినట్లు ఓ టాక్ నడుస్తుంది. వాలంటీర్ల నియామకం ఏపీ మాదిరిగా కాకుండా కొంత మార్పుతో అమలు చేయాలని చూస్తున్నారు. వీరు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలను ప్రచారం చేయడమే కాకుండా లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్లు, ఇతర సంక్షేమ ప్రయోజనాలను పంపిణీ చేయడం వంటి బాధ్యతలు కూడా అప్పగించనున్నట్టు సమాచారం.
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
This website uses cookies.