Revanth Reddy : జ‌గ‌న్ ఫార్ములాతో రేవంత్ రెడ్డి స‌రికొత్త రాజ‌కీయం.. త్వరలో గ్రామాల్లో కొత్త వ్యవస్థ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : జ‌గ‌న్ ఫార్ములాతో రేవంత్ రెడ్డి స‌రికొత్త రాజ‌కీయం.. త్వరలో గ్రామాల్లో కొత్త వ్యవస్థ..!

 Authored By ramu | The Telugu News | Updated on :11 April 2024,12:24 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : జ‌గ‌న్ ఫార్ములాతో రేవంత్ రెడ్డి స‌రికొత్త రాజ‌కీయం.. త్వరలో గ్రామాల్లో కొత్త వ్యవస్థ..!

Revanth Reddy : తెలంగాణలో ఊహించ‌ని విధంగా గెలుపొంది ఇప్పుడు అనేక కొత్త కార్య‌క్ర‌మాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం. అసెంబ్లీలో స‌త్తా చాటిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అదే రిజల్ట్ రిపీట్ చేయాలని భావిస్తోంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించటమే కాకుండా, స‌రికొత్త ఎత్తుగ‌డలు వేస్తూ ఓట‌ర్స్‌ని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బుధవారం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల సమీక్ష సమావేశానికి హాజరైన సీఎం నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో సీఎం జగన్ అమలు చేస్తున్న వాలంటీర్ల విధానం తరహాలో తెలంగాణలోనూ ఓ కొత్త వ్యవస్థను తీసుకొస్తామని రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికల ప్రచారంలో కీలకంగా మార‌డం మ‌నం చూశాం.

Revanth Reddy : జ‌గ‌న్‌ని కాపీ కొడుతున్నాడా..

ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి తప్పించటంతో రాజ‌కీయంగా పెద్ద దుమార‌మే రేగింది. ఇప్పుడు ఏపీలో గెలిచేందుకు ఇటు జ‌గ‌న్, అటు చంద్ర‌బాబు వాలంటీర్లకు హామీలు గుప్పిస్తున్నారు. ప్రజలకు చేరువ అయిన వాలంటీర్లను ఓన్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కి మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు దీనిని కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత దాదాపు 36,000 మంది వాలంటీర్లను నియమించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే పార్టీ నేతలతో తన ప్రణాళికలను పంచుకున్నట్లు తెలుస్తోంది.

Revanth Reddy జ‌గ‌న్ ఫార్ములాతో రేవంత్ రెడ్డి స‌రికొత్త రాజ‌కీయం త్వరలో గ్రామాల్లో కొత్త వ్యవస్థ

Revanth Reddy : జ‌గ‌న్ ఫార్ములాతో రేవంత్ రెడ్డి స‌రికొత్త రాజ‌కీయం.. త్వరలో గ్రామాల్లో కొత్త వ్యవస్థ..!

ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణలో అనేక పథకాలు అమలవుతుండ‌గా, ఆ ప‌థ‌కాల‌ని ప్ర‌జ‌ల‌కి మరింత చేరవేసేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలో బాగా పనిచేసిన కార్యకర్తలను గుర్తించి.. ఇందిరమ్మ కమిటీల్లో నియమిస్తామని చెప్పారు. వారికి ప్రభుత్వం నుంచి రూ. 6 వేల చొప్పున గౌరవ వేతనం కూడా ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించినట్లు ఓ టాక్ న‌డుస్తుంది. వాలంటీర్ల నియామకం ఏపీ మాదిరిగా కాకుండా కొంత మార్పుతో అమలు చేయాలని చూస్తున్నారు. వీరు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలను ప్రచారం చేయడమే కాకుండా లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్లు, ఇతర సంక్షేమ ప్రయోజనాలను పంపిణీ చేయడం వంటి బాధ్యతలు కూడా అప్పగించ‌నున్న‌ట్టు స‌మాచారం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది