Revanth Reddy : రేవంత్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్న బీ ఆర్ ఎస్ నేతలు.. మాది కుటుంబ పాలన అయితే మరి ఇది ఏంటో..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : రేవంత్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్న బీ ఆర్ ఎస్ నేతలు.. మాది కుటుంబ పాలన అయితే మరి ఇది ఏంటో..?

 Authored By ramu | The Telugu News | Updated on :9 August 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : రేవంత్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్న బీ ఆర్ ఎస్ నేతలు.. మాది కుటుంబ పాలన అయితే మరి ఇది ఏంటో..?

Revanth Reddy : తెలంగాణా తెచ్చిన టీ ఆర్ ఎస్ మీద అప్పటి ముఖ్యమంత్రి అయిన కే సీ ఆర్ మీద ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత యనముల రేవంత్ రెడ్డి ఎన్నో విధాలుగా టార్గెట్ చేస్తూ వచ్చారు. అందులో బాగా వినిపించేది కే సీ ఆర్ చేసిన కుటుంబ పాలన. కే సీ ఆర్ ఫ్యామిలీ మొత్తం వారి కబంధ హస్తాలతో తెలంగాణాని దోచేస్తుంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి పదే పదే కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఆయన మాటలు ప్రజల్లోకి బలంగా వెల్లడంతో ఈసారి ఆయనకు అధికారం కూడా ఇచ్చారు.ప్రస్తుతం తెలంగాణాలో కాంగ్రెస్ పాలన నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రఖ్యాతలు దెబ్బ రాకుండా ఉండటానికి చేస్తున్నారు. ఐతే తెర ముందు రేవంత్ రెడ్డి రాజకీయ ప్రక్షాలనకు తెర వెనక ఆయన సోదరులిద్దరి శ్రమ ఉంది. ఐతే సీఎం అయ్యాక రేవంత్ తన తమ్ముళ్లను కూడా రంగంలోకి దించితే కే సీ ఆర్ లానే తనది కుటుంబ పాలన అవుతుందని సోదరులిద్దరిని ఇంకా వెనకే ఉంచాడు. ఐతే అనూహ్యంగా రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి గురించి తెలంగాణా అంతటా చర్చ మొదలైంది.

Revanth Reddy హైదరాబాద్ మొత్తం ప్రత్యేక బ్యానర్లు.. మెయిన్ ఎడిషన్ యాడ్..

ఇన్నాళ్లు రేవంత్ వెనక ఉన్న సోదరుడు తిరుపతి రెడ్డి ఇప్పుడు తెర మీదకు వచ్చినట్టు తెలుస్తుంది. తిరుపతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా భారీ ప్లెస్లీఉ, పేపర్లో మెయిన్ ఎడిషన్ యాడ్స్ వచ్చాయి. అసలు తిరుపతి రెడ్డికి ఏ హోదా లేదు అలాంటి ఆయనకు మాట తప్పని మహనీయుడు. శత్రువులెరగని నాయకుడు, అలుపెరుగని ప్రజా సేవకుడు ఎనుముల తిరుపతి రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ యాడ్స్ కనిపించాయి.

Revanth Reddy రేవంత్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్న బీ ఆర్ ఎస్ నేతలు మాది కుటుంబ పాలన అయితే మరి ఇది ఏంటో

Revanth Reddy : రేవంత్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్న బీ ఆర్ ఎస్ నేతలు.. మాది కుటుంబ పాలన అయితే మరి ఇది ఏంటో..?

ఇక దొరికిందే ఛాన్స్ అన్నట్టు బీ ఆర్ ఎస్ నేతలు ఈ వ్యవహారాన్ని హైలెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రఘుత్వాన్ని ఎటాక్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై పలు రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీ ఆర్ ఎస్ లో కే సీ ఆర్ చేసింది కుటుంబ పాలన అయితే ఇప్పుడు రేవంత్ చేస్తుంది ఏంటి అంటూ ప్రజలతో కలిసి బీ ఆర్ ఎస్ నేతలు కూడా టార్గెట్ చేస్తున్నారు. మరి తిరుపతి రెడ్డి రేవంత్ పర్మిషన్ తోనే ఇలా చేశాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా రేవంత్ సోదరుల పనితో సీఎం కి కొత తలనొప్పులు వచ్చి పడ్డాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది