Revanth Reddy : రోడ్డు మీద అరిచే ప్రతి కుక్కని మనం రాయితో కొట్టలేం.. రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్స్

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: June 16, 2025, 9:30 pm
  •  Revanth Reddy : వాళ్లు తిట్టే తిట్లన్నీ నాకు ఆశీర్వాదంగా మారుతాయి .. రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్స్

Revanth Reddy : బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.. ఈ నేపధ్యంలో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. రాజకీయ వేధింపులతో ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా వెనక్కి తగ్గేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. చట్టం మీద ఉన్న గౌరవంతో ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని చెప్పుకొచ్చారు.

Revanth Reddy : రోడ్డు మీద అరిచే ప్రతి కుక్కని మనం రాయితో కొట్టలేం.. రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్స్

Revanth Reddy : రోడ్డు మీద అరిచే ప్రతి కుక్కని మనం రాయితో కొట్టలేం.. రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్స్

Revanth Reddy ఘాటు కౌంట‌ర్

ఇప్పుడు తనను ఏసీబీ విచారణకు పిలిచి రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. అవసరమైతే తనను అరెస్టు చేసేందుకు కూడా వెనుకాడరని, ఆ పరిస్థితి రావచ్చని తెలిపారు. తమకు జైళ్లు, కేసులు కొత్తకాదని, తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లొచ్చామన్నారు. జైలుకు వెళ్లేందుకు భయం లేదని, ఎన్నిసార్లయినా వెళతామన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుని గమనిస్తున్నారన్నారు. ఎన్నికల వేళ మాత్రమే రైతు బంధు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ దొంగ భాగోతాలు తెలంగాణ ప్రజలకు అర్ధమయ్యాయన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు కేటీఆర్. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి.. రోడ్డు మీద అరిచే ప్రతి కుక్కని మనం రాయితో కొట్టలేం క‌దా అని అన్నారు. పదేళ్లు పాలించి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చి ఇంకా సిగ్గులేకుండా రోడ్లపైకి వచ్చి నన్ను తిడుతున్నారు.ఎన్ని తిట్టినా నేను వాళ్లను పట్టించుకోను . వాళ్లు తిట్టే తిట్లన్నీ నాకు ఆశీర్వాదంగా మారుతాయి . నేను నా పని చేసుకుంటూ వెళ్తాను అని రేవంత్ అన్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp