Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉద్యమ కాలంలో వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ తల్లికి వివిధ రూపాలు ఇచ్చాయని, కానీ ఇప్పటివరకు తెలంగాణ తల్లి రూపాన్ని అధికారికంగా ప్రకటించలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకే ప్రజా ప్రభుత్వం బహుజనుల తల్లి రూపమే తెలంగాణ తల్లి రూపంగా అధికారికంగా ప్రకటించిందని చెప్పారు. తెలంగాణ తల్లి నిలువెత్తు విగ్రహాన్ని సోమవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తల్లిని చూస్తే కన్నతల్లి ప్రతిరూపంగా స్ఫురిస్తోందన్నారు.
డిసెంబర్ 9 ఒక పవిత్రమైన రోజు.. ఒక పండుగ రోజని, ఈ రోజు మన ఆలోచనలన్నీ అమ్మ చుట్టూనే ఉండాలని ఒక పండుగలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిపై దాడి చేయడమే కాదు ఏకంగా అవమానించారని తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వలాభాలను మాత్రమే చూసుకున్నారని అందుకే ప్రజల ఆకాంక్షలు వెనుకబడ్డాయని తెలిపారు. ఇక తెలంగాణ కవులు, కళాకారులకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు తెలిపారు. తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన కవులను గుర్తించాలని, గౌరవించాలని ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి, అందెశ్రీ, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరి రావులను ప్రభుత్వం గుర్తిస్తోంది.
వారికి 300 గజాల ఇంటి స్థలంతో రూ.కోటి నగదు, తామర పత్రం అందించనున్నాం అని సీఎం తెలిపారు .. తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకుని ముందుకు నడిపిన కవులను గుర్తు చేసుకున్నారు. వారి సేవలకు గౌరవ సూచకంగా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా గత పాలకులు వాహనాలకు టీజీ బదులు టీఎస్ అని నిర్ణయించారని, అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టీజీని అధికారికంగా వాహనాలకు ఏర్పాటు చేసేలా అమలులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఉద్యమ సమయంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని పదేళ్లుగా రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని, ప్రజా ప్రభుత్వంలో ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో కవి అందెశ్రీని సన్మానించుకోవడం తనకు జీవితకాలం గుర్తుండే సందర్భమని చెప్పారు.
Ragi : మనము తినే రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఈ చిరుధాన్యాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో…
Lip Care : చాలామందికి గులాబీ రంగులో పెదాలు అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరుకు ఇది సాధ్యం…
Rotis : ప్రస్తుత కాలంలో రైస్ ఎక్కువగా తినడానికి ఇష్టపడని వారు. చపాతీల్ని ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే అన్నంలో కలిగే…
Winter : చలికాలంలో వాతావరణం కూల్ గా ఉంటుంది కాబట్టి,అనేక అంటువ్యాధులు కలుగుతాయి.దీంతో జలుబు దగ్గు అంటి వ్యాధులతో ఇబ్బంది…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహము సంపదలను ఇచ్చే గ్రహంగా చెప్పబడుతుంది. శుక్రుడు ధనానికి, సంపదకు అధిపతి…
Zodiac Signs : అందరికీ సొంత ఇంటి కల ఉంటుంది. డబ్బు ఉన్న ఇల్లు కొనడానికి స్థలము కొనుగోలు చేయాలని…
Jahnvi Kapoor : శ్రీదేవి తనయురాలుగా జాన్వి కపూర్ బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూనే…
Pooja Hegde : అందాల భామ పూజా హెగ్దేకి సౌత్ లో బ్యాడ్ టైం కొనసాగుతుంది. అమ్మడు చేసిన సినిమాలు…
This website uses cookies.