Revanth Reddy : గుడ్‌న్యూస్‌.. వారికి 300 గజాల ఇంటి స్థలంతో కోటి రూపాయ‌లు.. సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : గుడ్‌న్యూస్‌.. వారికి 300 గజాల ఇంటి స్థలంతో కోటి రూపాయ‌లు.. సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

 Authored By ramu | The Telugu News | Updated on :10 December 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : గుడ్‌న్యూస్‌.. వారికి 300 గజాల ఇంటి స్థలంతో కోటి రూపాయ‌లు.. సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

Revanth Reddy : తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉద్యమ కాలంలో వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ తల్లికి వివిధ రూపాలు ఇచ్చాయని, కానీ ఇప్పటివరకు తెలంగాణ తల్లి రూపాన్ని అధికారికంగా ప్రకటించలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకే ప్రజా ప్రభుత్వం బహుజనుల తల్లి రూపమే తెలంగాణ తల్లి రూపంగా అధికారికంగా ప్రకటించిందని చెప్పారు. తెలంగాణ తల్లి నిలువెత్తు విగ్రహాన్ని సోమవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తల్లిని చూస్తే కన్నతల్లి ప్రతిరూపంగా స్ఫురిస్తోందన్నారు.

Revanth Reddy గుడ్‌న్యూస్‌ వారికి 300 గజాల ఇంటి స్థలంతో కోటి రూపాయ‌లు సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

Revanth Reddy : గుడ్‌న్యూస్‌.. వారికి 300 గజాల ఇంటి స్థలంతో కోటి రూపాయ‌లు.. సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

Revanth Reddy : గొప్ప ఛాన్స్..

డిసెంబర్ 9 ఒక పవిత్రమైన రోజు.. ఒక పండుగ రోజని, ఈ రోజు మన ఆలోచనలన్నీ అమ్మ చుట్టూనే ఉండాలని ఒక పండుగలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిపై దాడి చేయడమే కాదు ఏకంగా అవమానించారని తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వలాభాలను మాత్రమే చూసుకున్నారని అందుకే ప్రజల ఆకాంక్షలు వెనుకబడ్డాయని తెలిపారు. ఇక తెలంగాణ కవులు, కళాకారులకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు తెలిపారు. తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన కవులను గుర్తించాలని, గౌరవించాలని ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి, అందెశ్రీ, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరి రావులను ప్రభుత్వం గుర్తిస్తోంది.

వారికి 300 గజాల ఇంటి స్థలంతో రూ.కోటి నగదు, తామర పత్రం అందించనున్నాం అని సీఎం తెలిపారు .. తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకుని ముందుకు నడిపిన కవులను గుర్తు చేసుకున్నారు. వారి సేవలకు గౌరవ సూచకంగా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా గత పాలకులు వాహనాలకు టీజీ బదులు టీఎస్ అని నిర్ణయించారని, అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టీజీని అధికారికంగా వాహనాలకు ఏర్పాటు చేసేలా అమలులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఉద్యమ సమయంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని పదేళ్లుగా రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని, ప్రజా ప్రభుత్వంలో ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో కవి అందెశ్రీని సన్మానించుకోవడం తనకు జీవితకాలం గుర్తుండే సందర్భమని చెప్పారు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది