
Revanth Reddy : కేసీఆర్ ని చూడడానికి హాస్పిటల్ కి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి..!!
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు.యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. నాలుగు రోజుల క్రితం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో జారిపడిన సంగతి తెలిసిందే. తుంటి ఎముక విరిగిన తర్వాత యశోద ఆసుపత్రిలో తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. కేసీఆర్ ను కలిసిన వెంటనే నమస్కారం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. 15 నిమిషాల పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఇక కేటీఆర్ తో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అసెంబ్లీకి తప్పకుండా రావాలని కేసీఆర్ ను కోరారని తెలిపారు. కేసీఆర్ సూచనలు, సలహాలు అవసరం అన్నారు. కేసీఆర్ కు పూర్తి సహాయ సహకారాలు అందించాలని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సిఎస్ ని ఆదేశించానన్న సీఎం రేవంత్ రెడ్డి కేసిఆర్ త్వరగా కోలుకోవాలని కోరినట్లు తెలిపారు. కెసిఆర్ ప్రజల తరపున అసెంబ్లీలో మాట్లాడాలని, ఆయన సూచనలను అందించాలని, అసెంబ్లీకి రావాలని కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే కేసీఆర్ ను కలిసేందుకు కేటీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. లోపలికి వెళుతున్నప్పుడు కేటీఆర్ పై సీఎం రేవంత్ భుజంపై చేయి వేసి మాట్లాడుతూ వెళ్లారు. కేటీఆర్ కు ధైర్యం చెప్పారు, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
శుక్రవారం రోజు కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడ్డారు. దీంతో ఆయన తుంటి ఎముక విరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆ గాయానికి శస్త్ర చికిత్స చేయించారు. ఇక ఇప్పుడిప్పుడే కెసిఆర్ నెమ్మదిగా నడవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు కేసీఆర్ ను చూడడానికి ఆసుపత్రికి వెళ్లారు. ఇక ఆసుపత్రి సిబ్బంది కూడా ఆయన ఆరోగ్యం గురించి ఏ రోజుకు ఆ రోజు బులెటిన్ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇక కేసీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి కేసీఆర్ ని కలిసిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.