Revanth Reddy : కేసీఆర్ ని చూడడానికి హాస్పిటల్ కి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : కేసీఆర్ ని చూడడానికి హాస్పిటల్ కి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి..!!

 Authored By anusha | The Telugu News | Updated on :10 December 2023,4:30 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : కేసీఆర్ ని చూడడానికి హాస్పిటల్ కి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి..!!

Revanth Reddy  : సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు.యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. నాలుగు రోజుల క్రితం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో జారిపడిన సంగతి తెలిసిందే. తుంటి ఎముక విరిగిన తర్వాత యశోద ఆసుపత్రిలో తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. కేసీఆర్ ను కలిసిన వెంటనే నమస్కారం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. 15 నిమిషాల పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఇక కేటీఆర్ తో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అసెంబ్లీకి తప్పకుండా రావాలని కేసీఆర్ ను కోరారని తెలిపారు. కేసీఆర్ సూచనలు, సలహాలు అవసరం అన్నారు. కేసీఆర్ కు పూర్తి సహాయ సహకారాలు అందించాలని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సిఎస్ ని ఆదేశించానన్న సీఎం రేవంత్ రెడ్డి కేసిఆర్ త్వరగా కోలుకోవాలని కోరినట్లు తెలిపారు. కెసిఆర్ ప్రజల తరపున అసెంబ్లీలో మాట్లాడాలని, ఆయన సూచనలను అందించాలని, అసెంబ్లీకి రావాలని కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే కేసీఆర్ ను కలిసేందుకు కేటీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. లోపలికి వెళుతున్నప్పుడు కేటీఆర్ పై సీఎం రేవంత్ భుజంపై చేయి వేసి మాట్లాడుతూ వెళ్లారు. కేటీఆర్ కు ధైర్యం చెప్పారు, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

శుక్రవారం రోజు కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడ్డారు. దీంతో ఆయన తుంటి ఎముక విరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆ గాయానికి శస్త్ర చికిత్స చేయించారు. ఇక ఇప్పుడిప్పుడే కెసిఆర్ నెమ్మదిగా నడవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు కేసీఆర్ ను చూడడానికి ఆసుపత్రికి వెళ్లారు. ఇక ఆసుపత్రి సిబ్బంది కూడా ఆయన ఆరోగ్యం గురించి ఏ రోజుకు ఆ రోజు బులెటిన్ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇక కేసీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి కేసీఆర్ ని కలిసిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది