Farmers : రైతుల కోసం రేవంత్ సర్కార్ మరో పథకం
Farmers : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒకొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే రైతులకు పంట పెట్టుబడి సహాయంగా “రైతు భరోసా” పథకం కింద రూ. 8,744.13 కోట్లను 69.39 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా రికార్డు స్థాయిలో నిధుల పంపిణీ పూర్తి చేసింది. ఇది రాష్ట్రంలో రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో ఓ మైలురాయిగా నిలిచింది.
Farmers : రైతుల కోసం రేవంత్ సర్కార్ మరో పథకం
రైతుల ఆదాయం పెరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రో ఫారెస్ట్రీ విధానాన్ని ప్రోత్సహించేందుకు ముందడుగు వేసింది. ఈ విధానంలో వ్యవసాయ భూమిలో పంటలతో పాటు వృక్షాలనూ పెంచే అవకాశం ఉంటుంది. దీనివల్ల పంటల ఆదాయం తో పాటు వృక్ష ఉత్పత్తుల ద్వారా అదనంగా సంపాదించవచ్చు. పైగా అడవుల విస్తీర్ణం పెరగడం, వాతావరణానికి హానికలిగించే కాలుష్యాన్ని తగ్గించడం వంటి పర్యావరణ ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు నేషనల్ టింబర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది.
రాష్ట్రంలో భూమిలేని వ్యవసాయ కూలీలకూ “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” పథకం కింద ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. కౌలు రైతులకు కూడా నిధులు అందించేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఏటా రూ. 12,000 వరకు సాయం అందిస్తామన్న హామీ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక మరోవైపు, రైతుల పొలాల్లో బోర్లకు సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేసి, మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేసే వ్యవస్థను అమలు చేయనుంది. ఇలా సరఫరా చేసిన ప్రతి యూనిట్‌కు రైతుకు రూ. 3.13 చొప్పున డిస్కమ్ సంస్థలు చెల్లించనున్నాయి. దీంతో రైతులు పంటలతో పాటు సోలార్ ద్వారా కూడా అదనంగా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
This website uses cookies.