Tea : టీ అంటే పడి చచ్చే అభిమానులకు... ఎక్కువగా తాగారో... ఈ వ్యాధులు తథ్యం...?
Tea : ఈరోజుల్లో టీ ప్రియుల సంఖ్య ఎక్కువగానే ఉంది. టీ తాగేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. కానీ టీ తాగేటప్పుడు ఒకసారి ఆలోచించండి.ఎక్కువగా తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో కూడా తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే అనారోగ్య సమస్యలు రానంతవరకు హ్యాపీగానే ఉంటాం. కానీ అవి మనం చేసే పొరపాట్లు వల్లే వస్తున్నాయి అనే విషయం తెలుసుకోవాలి. ఏం కాదులే అని కొట్టి పడేసే కొన్ని ఆహారాలే..మనకు అనారోగ్య సమస్యలను తెచ్చి పెడతాయి.ఈ ఒక విషయం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకు ఆరోగ్యం బాగుంటుంది. అయితే, కొన్ని ఆహార పదార్థాల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో, అలాగే కొన్ని పానీయాల వల్ల కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందులో ముఖ్యంగా టీ ఒకటి. టి అంటే ఇష్టమని చెప్పి, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు తాగుతూ ఉంటారు. అసలు, టీ ని ఎన్నిసార్లు తాగాలి అని,నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారు, ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం…
Tea : టీ అంటే పడి చచ్చే అభిమానులకు… ఎక్కువగా తాగారో… ఈ వ్యాధులు తథ్యం…?
ఈ రోజుల్లో టీ ఇంట్లో ఎక్కువగా తాగుతుంటారు.బయట రోడ్డు పక్కన చాయ్ కోట్లల్లో కూడా ఎక్కువగా తాగుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు పడితే అప్పుడు,ఎన్నిసార్లు ఉంటే అన్ని సాగుతూ ఉంటారు. కొందరు టీ తాగకపోతే, ఆ రోజు పొద్దు గడమే గడవదు. రోజుకి 1 లేదా రెండుసార్లు టీ తాగితే పర్వాలేదు, కానీ అంతకంటే ఎక్కువసార్లు సేవిస్తే, ఎన్నో రోగాలు వ్యాప్తి చెందుతాయి అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది. అయితే, వాతావరణం చాలా చల్లగా ఉండడంతో చాలామంది ఎక్కువగా వేడివేడి తిని తాగడానికి ఇష్టపడుతుంటారు. ఇలా తాగుతూ ఎన్ని టీ లు తాగామో కూడా లెక్క పెట్టుకోరు. వాతావరణం చల్లగా ఉండడంతో ఎవ్వరు కూడా టీ తాగకుండా ఉండలేరు. టీ తాగే మక్కువను ఎక్కువగా ప్రేరేపిస్తుంది ఈ వాతావరణం. అందువలనే టీ తాగడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తిని ఎక్కువగా తాగకూడదు అంటున్నారు నిపుణులు. ప్రతిరోజు రెండు లేదా మూడు కప్పుల టీ మాత్రమే తాగాలి. అంతకంటే ఎక్కువ తాగితే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఎక్కువ టీ తాగితే శరీరంలో ఐరన్ లోపం ఏర్పడవచ్చు. ఇంకా నిద్రలేమి సమస్యకు కారణం అవుతుంది. రోజు టీ తాగకపోతే తలనొప్పి వస్తుంది. తలనొప్పిని భరించలేక కూడా టీ ని తాగాల్సి వస్తుంటుంది.
టీ తాగితే కొందరిలో తల తిరగడం, రక్తపోటు వంటి సమస్యలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. కొందరు ఎక్కువ మోతాదుల్లో బ్లాక్ టీ లేదా టీ తీసుకున్నట్లయితే, ఇది గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అంటున్నారు. అధికంగా టీ తాగితే కొన్నిసార్లు అధిక శరీరంలో అనేక సమస్యలకు దారి తీయవచ్చు. ముఖ్యంగా, చేతులు వనకడం ఆందోళన వంటి సమస్యలు తలెత్తవచ్చు. అంతేకాదు, పరగడుపున టీ తాగితే ఇది జీర్ణ క్రియ సమస్యలను దారితీస్తుంది. టీ అధికంగా తాగితే ఎముకలు బలహీనపడతాయి. టీ అధికంగా తాగితే కాల్షియం లోపం ఏర్పడుతుంది.దీనివల్ల ఎముకలు బలహీనపడటమే కాదు ఎముకలు విరిగే ప్రమాదం కూడా లేకపోలేదు అంటున్నారు నిపుణులు. అలాగే ఎక్కువగా టీ తాగితే ఆందోళన పెరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు కూడా పెరగవచ్చు. అంతేకాదు, బరువు తగ్గిపోతుంది.వీలైనంతవరకు టీ తక్కువ మోతాదులో సేవించాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.