RTC Bus : సామాన్యులకి ఆర్టీసి బస్సు ఎంత అందుబాటులో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా కూడా సామాన్యులు ఆర్టీసిని ఆశ్రయిస్తుంటారు. ఇటీవల ఏపీ, తెలంగాణలలో అయితే మహిళలకి ప్రత్యేక ఆఫర్స్ కల్పించారు. ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్‌లలో అయితే ఫ్రీగా అవకాశం కల్పించారు. అయితే కొద్ది సార్లు బస్సులు రాక ఇబ్బందులు పడడం కూడా మనం గమనించవచ్చు.అయితే విసుగెత్తి ఆటోలలో కూడా వెళుతుంటారు. అయితే ఓ అల్లుడు ఏకంగా ఆర్టీసీ బస్సుతో అత్తారింటికి వెళ్లి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అల్లుడు బస్సు వేసుకురావడమేమిటీ..? అని ఆశ్చర్యం కలుగుతుందా.. అయితే ఈ స్టోరీ వింటే అర్ధం అవుతుంది.
ఈ వింత ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. దుర్గయ్య అనే వ్యక్తి ముచ్చుమర్రిలో ఉన్న తన భార్య ఇంటికి వెళ్లాలని అనుకున్నాడు. అయితే, వెళ్లేందుకు డబ్బులు లేవు. ఇక ఏం చేయాలో తెలియక ఏకంగా ఆత్మకూరుకు చెందిన ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు. తరువాత బస్సును తిరిగి ముచ్చుమరి ఠాణాలో అప్పగించాడు దర్గయ్య. అయితే, దుర్గయ్య మతిస్థిమితం సరిగా లేదని అందుకే ఇలా చేశాడని బంధువులు తెలిపారు. . బస్సుల కోసం ఎదురు చూసి రాకపోవడంతో సమీపంలో నిలిపి ఉంచిన ఆర్టీసీ ప్రైవేట్ బస్సు వేసుకుని వచ్చేశాడట. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
వెంకటపురానికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి ఆత్మకూరు నుండి తన అత్తగారు ముచ్చుమర్రి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూశాడు. ఎంతకు ఆ బస్సు రాకపోవడంతో విసిగిపోయాడు. దీంతో సమీపంలోని పెట్రోల్ బంక్ దగ్గర ఆర్టీసీ ప్రైవేట్ (హైర్) బస్సు వద్దకు వెళ్లి స్టార్ చేసి.. నడుపుకుంటూ తన అత్త ఇంటికి తీసుకెళ్లిపోయాడు. అక్కడకు చేరుకున్నాక ఆశ్చర్యపోవడం వారి వంతైంది. వెంటనే బస్సును ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ నుండి ఆత్మకూరుకు పంపించారు. ఇదిలా ఉంటే.. ఈ బస్సు పోయిందని స్థానిక పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలుస్తుంది. ఎలాంటి కేసు కూడా నమోదు కాలేదని సమాచారం. దుర్గయ్య చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.