RTC Bus : అత్తారింటికి ఏకంగా ఆర్టీసీ బ‌స్సునే వేసుకెళ్లిన ఘ‌నుడు.. అలా ఎందుకు చేశాడంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

RTC Bus : అత్తారింటికి ఏకంగా ఆర్టీసీ బ‌స్సునే వేసుకెళ్లిన ఘ‌నుడు.. అలా ఎందుకు చేశాడంటే..!

RTC Bus : సామాన్యుల‌కి ఆర్టీసి బ‌స్సు ఎంత అందుబాటులో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎక్క‌డికి వెళ్లాల‌న్నా కూడా సామాన్యులు ఆర్టీసిని ఆశ్ర‌యిస్తుంటారు. ఇటీవ‌ల ఏపీ, తెలంగాణ‌ల‌లో అయితే మ‌హిళ‌ల‌కి ప్ర‌త్యేక ఆఫ‌ర్స్ కల్పించారు. ఆర్డిన‌రీ, ఎక్స్ ప్రెస్‌ల‌లో అయితే ఫ్రీగా అవ‌కాశం క‌ల్పించారు. అయితే కొద్ది సార్లు బ‌స్సులు రాక ఇబ్బందులు ప‌డ‌డం కూడా మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.అయితే విసుగెత్తి ఆటోల‌లో కూడా వెళుతుంటారు. అయితే ఓ అల్లుడు ఏకంగా ఆర్టీసీ బస్సుతో అత్తారింటికి వెళ్లి అందర్ని […]

 Authored By ramu | The Telugu News | Updated on :28 July 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  RTC Bus : అత్తారింటికి ఏకంగా ఆర్టీసీ బ‌స్సునే వేసుకెళ్లిన ఘ‌నుడు.. అలా ఎందుకు చేశాడంటే..!

RTC Bus : సామాన్యుల‌కి ఆర్టీసి బ‌స్సు ఎంత అందుబాటులో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎక్క‌డికి వెళ్లాల‌న్నా కూడా సామాన్యులు ఆర్టీసిని ఆశ్ర‌యిస్తుంటారు. ఇటీవ‌ల ఏపీ, తెలంగాణ‌ల‌లో అయితే మ‌హిళ‌ల‌కి ప్ర‌త్యేక ఆఫ‌ర్స్ కల్పించారు. ఆర్డిన‌రీ, ఎక్స్ ప్రెస్‌ల‌లో అయితే ఫ్రీగా అవ‌కాశం క‌ల్పించారు. అయితే కొద్ది సార్లు బ‌స్సులు రాక ఇబ్బందులు ప‌డ‌డం కూడా మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.అయితే విసుగెత్తి ఆటోల‌లో కూడా వెళుతుంటారు. అయితే ఓ అల్లుడు ఏకంగా ఆర్టీసీ బస్సుతో అత్తారింటికి వెళ్లి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అల్లుడు బస్సు వేసుకురావడమేమిటీ..? అని ఆశ్చ‌ర్యం క‌లుగుతుందా.. అయితే ఈ స్టోరీ వింటే అర్ధం అవుతుంది.

RTC Bus వింత ఘ‌ట‌న‌..

ఈ వింత ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. దుర్గయ్య అనే వ్యక్తి ముచ్చుమర్రిలో ఉన్న తన భార్య ఇంటికి వెళ్లాలని అనుకున్నాడు. అయితే, వెళ్లేందుకు డబ్బులు లేవు. ఇక ఏం చేయాలో తెలియక ఏకంగా ఆత్మకూరుకు చెందిన ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు. తరువాత బస్సును తిరిగి ముచ్చుమరి ఠాణాలో అప్పగించాడు దర్గయ్య. అయితే, దుర్గయ్య మతిస్థిమితం సరిగా లేదని అందుకే ఇలా చేశాడని బంధువులు తెలిపారు. . బస్సుల కోసం ఎదురు చూసి రాకపోవడంతో సమీపంలో నిలిపి ఉంచిన ఆర్టీసీ ప్రైవేట్ బస్సు వేసుకుని వచ్చేశాడట. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

RTC Bus అత్తారింటికి ఏకంగా ఆర్టీసీ బ‌స్సునే వేసుకెళ్లిన ఘ‌నుడు అలా ఎందుకు చేశాడంటే

RTC Bus : అత్తారింటికి ఏకంగా ఆర్టీసీ బ‌స్సునే వేసుకెళ్లిన ఘ‌నుడు.. అలా ఎందుకు చేశాడంటే..!

వెంకటపురానికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి ఆత్మకూరు నుండి తన అత్తగారు ముచ్చుమర్రి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూశాడు. ఎంతకు ఆ బస్సు రాకపోవడంతో విసిగిపోయాడు. దీంతో సమీపంలోని పెట్రోల్ బంక్ దగ్గర ఆర్టీసీ ప్రైవేట్ (హైర్) బస్సు వద్దకు వెళ్లి స్టార్ చేసి.. నడుపుకుంటూ తన అత్త ఇంటికి తీసుకెళ్లిపోయాడు. అక్కడకు చేరుకున్నాక ఆశ్చర్యపోవడం వారి వంతైంది. వెంటనే బస్సును ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ నుండి ఆత్మకూరుకు పంపించారు. ఇదిలా ఉంటే.. ఈ బస్సు పోయిందని స్థానిక పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలుస్తుంది. ఎలాంటి కేసు కూడా నమోదు కాలేదని సమాచారం. దుర్గయ్య చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది