
Runa Mafi : ప్రజాప్రభుత్వంలో రైతు రుణమాఫీ దేశచరిత్రలోనే రికార్డు సీఎం రేవంత్ రెడ్డి..!
Runa Mafi : స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం తలపెట్టలేనంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేస్తూ తెలంగాణ ప్రజాప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. తొలి విడతలో రూ.1లక్షలోపు రుణాలు మాఫీ, రెండో విడతలో రూ.1.50లక్షల లోపు రుణాల మాఫీ కింద 12 రోజుల వ్యవధిలోనే లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.12,224 కోట్లను జమ చేశామని ముఖ్యమంత్రి ప్రకటించారు. శాసనసభ ప్రాంగణంలో మంగళవారం రెండో విడత రుణమాఫీకి సంబంధించిన చెక్కును రైతుల చేతికి మఖ్యమంత్రి గారు అందజేశారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమ అయ్యే ప్రక్రియ ప్రారంభమైంది.
మాట ఇచ్చిన విధంగా ఆగస్టులోనే మూడో విడత చేపట్టి మొత్తం రూ.31వేల కోట్ల రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత స్వల్ప వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేయలేదని, ఆ ఘనత తెలంగాణ ప్రజాప్రభుత్వానికే దక్కడం గర్వంగా ఉందని సీఎం అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను రాజకీయ ప్రయోజనాల దృష్టితో చూడబోదని, అన్నదాతలు బాగుండాలన్నదే తమ విధానమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నాటి నెహ్రూ గారి కాలం నుంచీ నేటి రాహుల్ గాంధీ తరం వరకు కాంగ్రెస్ పార్టీ చరిత్రపొడవునా రైతు పక్షపాతిగానే కొనసాగుతోందని సీఎం గుర్తుచేశారు.
తెలంగాణలో గత ప్రభుత్వం పదేండ్లలో పట్టుమని లక్ష రూపాయాల రుణమాఫీ కూడా సజావుగా చేయలేకపోయిందని, గత పాలకులు రాష్ట్రంపై మోపిన అప్పుల భారాన్ని నిభాయిస్తూనే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రూ.2లక్షల రుణమాఫీని అమలు చేస్తున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. రైతు రుణమాఫీ కోసం 12 రోజుల్లోనే రూ.12వేల కోట్లు సమకూర్చిన ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.జులై 18న మొదటి విడతలో 11,34,412 మంది రైతుల ఖాతాల్లో రూ. 6034.96 కోట్లు జమకాగా, నేడు (జులై 30న) రెండవ విడతలో 6,40,223 మంది రైతుల ఖాతాల్లో రూ. 6190.01 కోట్లు జమ అవుతున్నాయి. ఆగస్టు పూర్తయ్యేలోపే చివరిదైన మూడవ విడతలో 17,75,235 మంది రైతుల ఖాతాల్లో రూ.12224.98 కోట్లు జమ చేయడంతో రూ.2లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తికానుంది.
Runa Mafi : ప్రజాప్రభుత్వంలో రైతు రుణమాఫీ దేశచరిత్రలోనే రికార్డు సీఎం రేవంత్ రెడ్డి..!
కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, దామోదర రాజనర్సింహ గారు, కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొండా సురేఖ గారు, జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Peddi Box Office Collection Day 3 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం…
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఈరోజు మంచి వార్త వచ్చింది. గత కొన్ని…
Eat Eggs in Summer : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి…
Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్‌లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
This website uses cookies.