Rythu Runa Mafi : తెలంగాణ రైతు రుణ మాఫీ ఎప్పుడెప్పుడా అని రైతులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ వచ్చారు. దానికి ముహుర్తం సమీపించింది. గురువారం సాయంత్రానికి లక్ష రుపాయల్లోపు రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. రైతు రుణ మాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం నుంచి లక్ష రుపాయల్లోపు రుణాలను మాఫీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి నిధులను విడుదల చేయనున్నారు.మూడు విడతల్లో రైతు రుణమాఫీ నిధులు విడుదల కానున్నాయి.
రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రుణాలున్నాయని.. వారిలో 6.36 లక్షల మందికి రేషన్‌కార్డులు లేవన్నారు. అయినా సరే వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందన్నారు.రైతులకు రేషన్ కార్డులు లేకపోయినా సరే వారి అకౌంట్లో డబ్బులు జమ చేయాలని బ్యాంకులకు సీఎం ఆదేశించారు. రైతులకు అన్యాయం జరగనివ్వమన్నారు.రాష్ట్రంలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకం ఆధారంగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని, కేవలం కుటుంబ వివరాలను గుర్తించడానికి మాత్రమే రేషన్‌కార్డు నిబంధన విధించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.రైతు రుణమాఫీ అమలుపై ప్రజా భవన్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలతో సిఎం సమావేశం అయ్యారు.
ఆగస్టులోపు పూర్తిగా నిధులు విడుదల చేస్తామన్నారు. రేషన్ కార్డులు లేని వారికి కూడా రుణమాఫీ అమలు చేయనున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తం అర్హులైన వారిలో 6.36లక్షల మందికి రేషన్ కార్డులు లేవని వారికి కూడా పథకం వర్తిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. గురువారం రైతుల ఖాతాల్లో నగదు జమ అయిన తర్వాత రుణమాఫీ లబ్ధిదారులతో సంబురాలు జరపాలని.. వీటికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కావాలని సీఎం ఆదేశించారు.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.