Ismart Song : ఈ మధ్య కాలంలో హిట్టైన సినిమాలకి సీక్వెల్స్ వస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. అందులో కొన్ని విజయం సాధిస్తే మరి కొన్ని ఫ్లాప్స్ అందుకున్నాయి. తొలిపార్టుతో ఊహించని రికార్డులు కొల్లగొట్టిన సినిమా.. సీక్వెల్‌తో బాక్సాఫీస్ దగ్గర ఊచకోతే అని ఎగ్‌జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తుంటారు.ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ శంకర్ కోసం చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు.అప్పటివరకు లవర్ బాయ్ రోల్స్‌తో అదరగొట్టిన రామ్ పోతినేని.. తొలిసారి మాస్ క్యారెక్టర్‌లో ఇరగదీశాడు. ఈ సినిమాతో రామ్‌కు మాస్ ఆడియెన్స్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా తర్వాత రామ్ కథల ఎంపికలో కూడా చాలా చేంజేస్ వచ్చాయి.అదే క్రేజ్‌తో డబుల్ ఇస్మార్ట్‌ను స్టార్ట్ చేశారు. గతేడాది జులైలో సెట్స్ మీదకు వెళ్లిన డబుల్ ఇస్మార్ట్.. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌తో శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది.
ఓ వైపు లైగర్ తో భారీ దెబ్బ తిన్న పూరి.. ఈ సారి ఎలాగైనా మాస్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో డబుల్ ఇస్మార్ట్ ను తెరకెక్కిస్తున్నాడు. పైగా సంజయ్ దత్ వంటి బాలీవుడ్ స్టార్ ను రంగంలోకి దింపడంతో ఈ సినిమాపై ఆడియెన్స్ లో అంచనాలు ఒక్కసారిగా ఎగబాకాయి.డబుల్ ఇస్మార్ట్ సోలోగా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు.. ఆడియెన్స్‌లో మాములు అంచనాలు క్రియేట్ చేయలేదు. మరీ ముఖ్యంగా ఈ సారి పూరీ మాస్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అని సినీ లవర్స్ ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. తాజాగా చిత్రం నుండి ఓ సాంగ్ విడుదలైంది. కల్లు దుకాణం వద్ద ఉండే ఓ పాట మధ్యలో దర్శకుడు పూరీ జగన్నాధ్ ‘అయితే ఏం చేద్దామంటవ్ మరి’ అని మీడియా సమావేశాలలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనే మాటను ముందు పెట్టడం తీవ్ర దుమారం రేపుతుంది.
కల్లు దుకాణం వద్ద చిత్రీకరించే పాటకు కేసీఆర్ వాయిస్ తీసుకోవడం తీవ్రంగా అవమానించడమేనని విమర్శలు మొదలయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న డబల్ ఇస్మార్ట్ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తుండగా చార్మి కౌర్ నిర్మిస్తున్నది. మణిశర్మ సంగీతం అందించగా రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటను కాసర్ల శ్యాం రాశారు. అయితే ఒక పాట విడుదల చేస్తున్నప్పుడు ఆ సినిమా దర్శకుడి మీదనే అన్ని బాధ్యతలు ఉంటాయి. సినిమా అనేది సమాజం మీద ప్రభావం చూయించే రంగాలలో ప్రధానమయింది. ఒక మాజీ ముఖ్యమంత్రి వాయిస్ ను తీసుకుంటున్నప్పుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సున్నితమైన అంశాలు అనవసర వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది. మరి దీనిపై చిత్ర బృందం ఇప్పటి వరకైతే స్పందించలేదు కాని ఏదో ఒక క్లారిటీ అయితే వస్తుందని ముచ్చటించుకుంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.