Rythu Runa Mafi : రాష్ట్రమంతటా పండుగ వాతావరణం… రైతుల‌ రుణ‌మాఫీ డ‌బ్బులు విడుద‌ల‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rythu Runa Mafi : రాష్ట్రమంతటా పండుగ వాతావరణం… రైతుల‌ రుణ‌మాఫీ డ‌బ్బులు విడుద‌ల‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 July 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Rythu Runa Mafi : రాష్ట్రమంతటా పండుగ వాతావరణం... రైతుల‌ రుణ‌మాఫీ డ‌బ్బులు విడుద‌ల‌..!

Rythu Runa Mafi : తెలంగాణ రైతు రుణ మాఫీ ఎప్పుడెప్పుడా అని రైతులు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ వ‌చ్చారు. దానికి ముహుర్తం సమీపించింది. గురువారం సాయంత్రానికి లక్ష రుపాయల్లోపు రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. రైతు రుణ మాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం నుంచి లక్ష రుపాయల్లోపు రుణాలను మాఫీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి నిధులను విడుదల చేయనున్నారు.మూడు విడతల్లో రైతు రుణమాఫీ నిధులు విడుదల కానున్నాయి.

Rythu Runa Mafi హ్యాపీ మూమెంట్..

రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రుణాలున్నాయని.. వారిలో 6.36 లక్షల మందికి రేషన్‌కార్డులు లేవన్నారు. అయినా సరే వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందన్నారు.రైతులకు రేషన్ కార్డులు లేకపోయినా సరే వారి అకౌంట్లో డబ్బులు జమ చేయాలని బ్యాంకులకు సీఎం ఆదేశించారు. రైతులకు అన్యాయం జరగనివ్వమన్నారు.రాష్ట్రంలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకం ఆధారంగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని, కేవలం కుటుంబ వివరాలను గుర్తించడానికి మాత్రమే రేషన్‌కార్డు నిబంధన విధించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.రైతు రుణమాఫీ అమలుపై ప్రజా భవన్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నేతలతో సిఎం సమావేశం అయ్యారు.

Rythu Runa Mafi రాష్ట్రమంతటా పండుగ వాతావరణం రైతుల‌ రుణ‌మాఫీ డ‌బ్బులు విడుద‌ల‌

Rythu Runa Mafi : రాష్ట్రమంతటా పండుగ వాతావరణం… రైతుల‌ రుణ‌మాఫీ డ‌బ్బులు విడుద‌ల‌..!

ఆగస్టులోపు పూర్తిగా నిధులు విడుదల చేస్తామన్నారు. రేషన్‌ కార్డులు లేని వారికి కూడా రుణమాఫీ అమలు చేయనున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తం అర్హులైన వారిలో 6.36లక్షల మందికి రేషన్‌ కార్డులు లేవని వారికి కూడా పథకం వర్తిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. గురువారం రైతుల ఖాతాల్లో నగదు జమ అయిన తర్వాత రుణమాఫీ లబ్ధిదారులతో సంబురాలు జరపాలని.. వీటికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కావాలని సీఎం ఆదేశించారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది