Sankranti Holidays : తెలంగాణ విద్యార్ధుల పేరెంట్స్ ఆందోళన.. సంక్రాంతి సెలవులు పొడిగించాలంటూ డిమాండ్
ప్రధానాంశాలు:
Sankranti Holidays : తెలంగాణ విద్యార్ధుల పేరెంట్స్ ఆందోళన.. సంక్రాంతి సెలవులు పొడిగించాలంటూ డిమాండ్
Sankranti Holiday : తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. వారం రోజుల ముందే మొదలైన పండుగ సందడి భోగి, సంక్రాంతి, కనుమతో పీక్స్‌కి చేరింది. అయితే పండుగ ఆనందం ఇంకా కొనసాగుతుండగానే తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవాళ్టితో (జనవరి 16) ముగియనుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.తెలంగాణలో స్కూళ్లు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కావాల్సి ఉండటంతో, పండుగకు సొంతూళ్లకు వెళ్లిన కుటుంబాలు ఇప్పుడే తిరుగు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ కుటుంబాలు ఇంకా పండుగ సెలబ్రేషన్స్‌లో ఉండగానే సెలవులు ముగియడం అసౌకర్యంగా మారిందని అంటున్నారు.
Sankranti Holidays : తెలంగాణ విద్యార్ధుల పేరెంట్స్ ఆందోళన.. సంక్రాంతి సెలవులు పొడిగించాలంటూ డిమాండ్
Sankranti Holiday : నిర్ణయం ఎలా ఉంటుంది?
సాధారణంగా కనుమ రోజు ప్రయాణాలు చేయడం మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. కానీ పిల్లల స్కూల్ మిస్ కాకూడదంటే కనుమ రోజే ప్రయాణం చేయాల్సి వస్తోందని పేరెంట్స్ వాపోతున్నారు. అందుకే ఏపీలో మాదిరిగా తెలంగాణలో కూడా సంక్రాంతి సెలవులను జనవరి 18 వరకు పొడిగించి, జనవరి 19 సోమవారం నుంచి స్కూళ్లు రీఓపెన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ డిమాండ్ కేవలం ఆంధ్రప్రదేశ్ కుటుంబాల నుంచే కాదు… తెలంగాణకు చెందిన పేరెంట్స్ నుంచీ వస్తోంది. ఒక్క రోజు (జనవరి 17 – శనివారం) కోసం పండుగ మధ్యలో ప్రయాణం చేయాల్సిన అవసరం ఎందుకు అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు సెలవు ఇస్తే ఆదివారం కూడా కలిసివస్తుందని, అప్పుడు కనుమను ప్రశాంతంగా జరుపుకుని ఆదివారం ప్రయాణించి సోమవారం పిల్లలను ఫ్రెష్‌గా స్కూళ్లకు పంపించవచ్చని అభిప్రాయపడుతున్నారు.
టీచర్ల నుంచీ ఇదే స్వరం వినిపిస్తోంది. శనివారం స్కూళ్లు తెరిచినా విద్యార్థుల హాజరు తక్కువగానే ఉంటుందని, కాబట్టి ఆ రోజు సెలవు ఇవ్వడమే బెటర్ అని వారు అంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు స్వయంగా జనవరి 18 వరకు సెలవులు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే… అక్కడ జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూల్స్ అన్నీ జనవరి 19న తిరిగి ప్రారంభమవుతాయి. అందుకే అక్కడ పేరెంట్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. తెలంగాణలో మాత్రం ఇవాళ్టితో సెలవులు ముగియడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉండగా, వచ్చే వారం మరో లాంగ్ వీకెండ్ కూడా ఉంది. జనవరి 26 రిపబ్లిక్ డే సోమవారం రావడంతో ఆదివారం కలిసివస్తుంది. విద్యార్థులకు రెండు రోజులే సెలవులు ఉన్నా, ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులకు శని-ఆది-సోమ మూడు రోజుల వీకెండ్ లభించనుంది. ఇప్పుడు అందరి దృష్టి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయంపైనే ఉంది.