Harish Rao : హుజురాబాద్ ఉప ఎన్నిక బాధ్యతలు చూస్తున్న హరీష్ రావు.. దుబ్బాకలో జరిగిన లోపాలను, లోటుపాట్లను సమీక్షించుకుంటూ ముందుకు సాగుతున్నారు. దుబ్బాకలో బీజేపీకి సోషల్ మీడియానే ప్లస్ గా మారిందనే అంచనాకు వచ్చిన హరీష్ రావు.. హుజురాబాద్ లో ముందే అప్రపమత్తమయ్యారు. సిద్దిపేట్లో సోషల్ మీడియా యాక్టివ్ మెంబర్స్‌తో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు హరీష్ రావు. విపక్షాలకు ఎత్తుకు పైఎత్తులు ఎలా వేయాలో, ప్రత్యర్థి వర్గాల పోస్టులను ఎలా కౌంటర్ చేయాలో దిశా నిర్దేశం చేశారు. సోషల్ మీడియా మీటింగ్‌లో పాల్గొన్న వారియర్స్ హరీశ్‌రావుతో ఫోటోలు దిగి ఏఫ్‌బీలో పోస్ట్ చేశారు.
ఇది కొత్త రగడకు తెరతీసింది. ఈ సమావేశానికి కొందరికే ఆహ్వానం పంపడంతో సమావేశానికి పిలుపు రాని వారంతా గుస్సాగా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది యాక్టివ్ మెంబర్స్ టీఆర్ఎస్ నాయకులతో ప్రత్యేక్ష సంబంధాలు లేకపోయినా కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో, పార్టీ మీద ప్రేమతో ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ అనుకూల పోస్టులను పెడుతూ వస్తున్నారు. ప్రత్యర్థి వర్గాల దాడులను తమదైన శైలిలో సోషల్ మీడియాలో కౌంటర్ చేస్తున్నారు. ఇలాంటి వారికి కూడా హరీశ్‌రావు నుంచి ఆహ్వానం అందకపోవడం వారిని తీవ్ర అసంతృప్తికి లోను చేసింది. దీంతో ఫేస్‌బుక్‌లో తమ వాల్స్ పై అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇంత పనిచేస్తున్నా కనీస గుర్తింపు లేదనే ఆవేదన వ్యక్తం చేశారు. ఇది హరీశ్‌రావుకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది.
సోషల్ మీడియా సమావేశానికి సంబంధించి మరో ప్రచారం కూడా సాగుతోంది. హరీష్ రావు టార్గెట్ గా కొందరు పోస్టులు పెడుతున్నారు. హరీష్ రావుకు మద్దతుగా ఉండేవారికి మాత్రమే సిద్దిపేట సమావేశానికి ఆహ్వానం వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా సమావేశం పేరుతో తన వర్గాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు హరీష్ రావు చేస్తున్నారని కొందరు పోస్టులు పెట్టారు.
త్వరలో హరీష్ రావు కూడా పార్టీ నుంచి బయటికి వెళతారేమోనని, అందుకే ఇలా చేస్తున్నారని కూడా వాదన తెరపైకి వస్తోంది. మొత్తానికి సిద్ధిపేటలో జరిగిన టీఆర్ఎస్ సోషల్ మీడియా సమావేశం కొత్త వివాదానికి దారి తీసిందనే అభిప్రాయం పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. దీంతో ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన హరీష్ రావు.. తాజా పరిణామాల నేపథ్యంలో మరో కొత్త వివాదంలో ఇరుక్కున్నారన్న టాక్ కేడర్ లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈటెల రాజేందర్ ఆరోపణలతో.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న హరీష్ రావు.. ఈ సమస్యకు ఏవిధంగా చెక్ పెడతారన్నదే ఆసక్తికరంగా మారింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.