Karthika Deepam 11 Aug Today Episode : కార్తీక దీపం 11 ఆగస్టు 2021, బుధవారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 1115 హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏసీపీ రోహిణి.. కార్తీక్ ను అరెస్ట్ చేసేందుకు కార్తీక్ ఇంటికి వచ్చి.. మోనిత శవాన్ని ఏం చేశావు.. అంటూ ప్రశ్నిస్తుంది. మోనిత ఏంటి? మోనిత శవం ఏంటి? మేడమ్.. అని దీప అడగగానే.. మోనితను నీ భర్త షూట్ చేసి చంపి… శవాన్ని కూడా మాయం చేశాడు. మోనితే లేనప్పుడు ఆమె గురించి మాట్లాడుకోవడం ఎందుకు? అని ఏసీబీ అంటుంది. దీంతో.. నాకు అబద్ధం చెప్పి కార్తీక్.. మోనిత దగ్గరికి వెళ్లాడా? అని దీప మనసులో అనుకుంటుంది. ఆయనే మోనితను చంపాడు అని చెప్పడానికి సాక్ష్యం ఏంటి? మేడమ్ అని ప్రశ్నిస్తుంది. ఇంతలో భాగ్యను పోలీసులు తీసుకొని వస్తారు. కార్తీక్ కారును కూడా చెక్ చేస్తారు. కార్తీక్ కారు డిక్కీలో రక్తపు మరకలు ఉన్నాయని పోలీసులు చెబుతారు. సాక్ష్యం కావాలన్నావు కదా.. ఇదిగో మీ పిన్నీనే సాక్ష్యం అని ఏసీపీ మేడమ్ చెబుతుంది.
ఇంతలోనే కార్తీక్ నాన్న, తమ్ముడు.. ఇద్దరూ ఇంటికి వస్తారు. పోలీసులను చూసి వాళ్లు షాక్ అయ్యారు. అందరూ కాసేపు సైలెంట్ గా ఉండండి.. అని ఏసీపీ చెప్పి.. నువ్వు చెప్పు భాగ్యం.. అసలు అక్కడ ఏం జరిగిందో.. అని అడుగుతుంది. దీంతో.. అక్కడ జరిగిన విషయం మొత్తం చెబుతుంది. రెండు బుల్లెట్స్ పేల్చిన సౌండ్ వినిపించిందని భాగ్యం చెబుతుంది.
దీంతో ఇంట్లో దొరికిన ఒక బుల్లెట్ ను చూపిస్తుంది ఏసీపీ రోహిణి. రెండో బుల్లెట్ గురి తప్పలేదు.. మోనిత బాడీలో దిగింది. ఈ బుల్లెట్ మీ అమ్మగారు వాడే లైసెన్స్ రివార్వర్ కు సంబంధించింది. ఇది మీ అమ్మగారి పేరు మీదే ఉంది. ఆవిడ ఊళ్లో లేదు. నీ కారు డిక్కీలో రక్తపు మరకలు ఉన్నాయి. నీ రివాల్వర్ లో ఇంకో నాలుగు బుల్లెట్స్ మాత్రమే ఉన్నాయి. చాలా.. ఈ సాక్ష్యాలు చాలా… అంటూ సాక్ష్యాలు చూపిస్తుంది ఏసీపీ.
డాక్టర్ బాబు ఏంటి ఇదంతా. ఏం జరిగింది.. మీరేంటి.. మోనితను చంపడం ఏంటి.. నమ్మలేకపోతున్నాను.. అని అనగానే.. చాలులే.. ఇక ఆపు దీప. ప్రపంచం నీఅంత పవిత్రంగా ఉంటుందని ఇంకా నమ్ముతున్నవా? నీ భర్తే ఈ హత్య చేశాడు. ఇందులో అనుమానమే లేదు.. అనగానే పెద్దోడా ఏంట్రా ఇది. ఏసీపీ గారు చెప్పేది నిజమేనా.. నువ్వేనా ఈ హత్య చేసింది. నిజం చెప్పరా? ఇలా మౌనంగా ఉంటావేంట్రా. మాట్లాడరా? లేదు.. నువ్వు ఇలాంటి పని ఎప్పటికీ చేయవు. ఏదో జరిగింది. నీకేం తెలుసో.. అదే చెప్పరా? మాట్లాడు.. అని కార్తీక్ ను అడుగుతాడు వాళ్ల నాన్న.
అన్నయ్య.. మోనిత.. నిన్నూ, వదినను ఎంత ఇబ్బంది పెట్టినా భరించావు కదా అన్నయ్యా. నువ్వేంటి.. ఈ దారుణం చేయడం ఏంటి.. లేదు అన్నయ్య.. జరిగింది ఏంటో క్లియర్ గా చెప్పు. ఇవాళ 25వ తేదీ. ఎలాగైనా పెళ్లి చేసుకుంటానని మోనిత.. కార్తీక్ కు చెప్పింది. మోనిత పట్టుపట్టింది. దీంతో తన వెంట తెచ్చుకున్న రివాల్వర్ తో షూట్ చేసి చంపాడు. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్.. అని అంటుంది ఏసీపీ మేడమ్. అనగానే ఏంటి మేడమ్.. ఇది మీరు నమ్ముతున్నారా?.. అని దీప అంటుంది. దీంతో.. ఏం నువ్వు నమ్మడం లేదా? అంటే.. లేదు మేడమ్.. నా మనస్సాక్షి నమ్మడం లేదు.. అనగానే నీ మనస్సాక్షిని కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పమను. ఏంటి దీప. ఆ మనిషిని నువ్వు ఎందుకు అంత గుడ్డిగా నమ్ముతున్నావు.. అని ఏసీపీ మేడమ్ అంటుంది.
ఓకే.. నేను మా లాయర్ ను తీసుకొని వచ్చి సరెండర్ చేస్తా.. అని చెబుతాడు కార్తీక్ నాన్న. దీంతో.. లేదండి.. ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ అంటుంది ఏసీపీ. సౌందర్య గారి సర్వీస్ రివాల్వర్ బుల్లెట్ ఇది. పదా.. కార్తీక్ అంటూ పోలీసులు తనను తీసుకెళ్తుండగా… ఇంతలో దీప.. ఏంటండి ఇది.. అని దీప అడుగుతుంది. దీంతో.. మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేను ఎలా తండ్రిని అయ్యానో… ఈ హత్యకు కూడా అలాగే నేను కారణమయ్యా.. అని చెబుతాడు కార్తీక్.
బాబూ.. నన్ను అమ్మా అన్నారు. కానీ.. ఆ అమ్మే మిమ్మల్ని పోలీసులకు పట్టించాల్సి వచ్చింది. నేను నిజంగా విన్నదే చెప్పాను బాబు. నన్ను క్షమించండి బాబు.. అని అంటుంది భాగ్య. దీపను, పిల్లలను మీరంతా జాగ్రత్తగా చూసుకోండి.. అని దీపకు దైర్యం చెబుతాడు. ఇంతలోనే పిల్లలు అక్కడికి వచ్చి.. పరిగెత్తుకుంటూ వస్తారు. నాన్నా.. డాడీ.. ఏమైంది.. అని ఆందోళన పడుతుంటారు. నిన్ను పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్నారు డాడీ.. నువ్వేం తప్పు చేశావు.. అంటూ ప్రశ్నిస్తారు. డాడీ.. నువ్వు వెళ్లొద్దు డాడీ.. నువ్వు లేకుండా మేం ఎలా ఉంటాం డాడీ.. అంటారు పిల్లలు. కార్తీక్ ఎందుకు ఇంత తొందర పడ్డాడు. నేరం చేసేముందు పసివాళ్లు గుర్తుకురాలేదా? అని ఏసీపీ మేడమ్ అనుకుంటుంది. మీరు ముగ్గురు తాతయ్య వాళ్ల ఇంటికి వెళ్లి ఉండండి.. అని చెబుతాడు కార్తీక్. ఇంతలో కార్తీక్ ఏంట్రా ఇది.. అని అడుగుతాడు కార్తీక్ నాన్న. పదేళ్ల పాపం ఊరికే పోతుందా డాడీ.. అని చెప్పి.. పోలీస్ జీపు ఎక్కి పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోతాడు కార్తీక్.
కార్తీక్.. పోలీస్ స్టేషన్ లో కూర్చొని.. అన్ని విషయాలను మరోసారి గుర్తు చేసుకుంటాడు. మోనిత చెప్పిన అసలు నిజాలను నెమరు వేసుకుంటాడు. ఎంత మోసం చేసింది నన్ను. తన వికృత స్వరూపం చూపించింది. అటువంటి దాన్న చంపితే తప్పేంటి. నాకు ఏనాడూ మోనిత మీద అనుమానం రాలేదు. చంపాలన్న ఆలోచనే రాలేదు. కానీ.. ఇవాళ చంపి తీరాలని అనిపించింది.. అని తనలో తాను అనుకుంటాడు కార్తీక్. తన తల్లి చెప్పిన మాటలు, తన తండ్రి అన్న మాటలు, దీప అన్న మాటలు.. గుర్తు తెచ్చుకొని తెగ బాధపడిపోతుంటాడు కార్తీక్. కొడుకుగా, భర్తగా, అన్ని రకాలుగా ఓడిపోవడానికి ఒకే ఒక కారణం.. మోనితతో స్నేహం.. అని అనుకుంటాడు కార్తీక్. రాత్రి కాగానే డాడీని పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు అని ప్రశ్నిస్తారు పిల్లలు. నాన్న ఎప్పుడు వస్తారో అదైనా తెలుసా? అని పిల్లలు అడుగుతారు. దీంతో తెలియదు.. అని చెబుతుంది దీప. కట్ చేస్తే.. సౌందర్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ హత్య చేసింది నేనే. నా కొడుకు కాదు. ఇదే నా సర్వీస్ రివాల్వర్. నన్ను అరెస్ట్ చేసి నా కొడుకు రిలీజ్ చేయండి.. అని అడుగుతుంది సౌందర్య. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే గురువారం ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.