
Former MLCs : ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీ ల బాధలు అన్నీఇన్నీ కావు..!
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా పదవుల కోసం కొట్లాటలు , విమర్శలు , అలగడలు , ఆరోపణలు చేయడం ఇలా నిత్యం జరుగుతూనే ఉంటుంది. తాజాగా మాజీ ఎమ్మెల్సీ లు సైతం అధిష్టానం పై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది.నిజామాబాద్ కాంగ్రెస్ వర్గాల్లో ప్రస్తుతం ఇద్దరు సీనియర్ నేతలు తీవ్ర మనోవేదనలో ఉన్నట్లు వినికిడి. వారు పార్టీకి అనేక సేవలు చేసినప్పటికీ, ఒక చిన్న తప్పే వారి రాజకీయ భవిష్యత్తుకు అడ్డు తగిలిందని స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత మరియు అరికెల నర్సారెడ్డి. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో పనిచేసి అనేక పదవుల్లో ఉన్నారు. కానీ పార్టీ మారిన దోషంతో ఇప్పుడు పార్టీ వేదికలపై సీటు కోసం ఎదురుచూస్తూ, ఫ్లెక్సీల్లో ఫోటోలు లేక అణగారిపోతున్న పరిస్థితి వీరి వేదనను వివరిస్తోంది.
Former MLCs : ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీ ల బాధలు అన్నీఇన్నీ కావు..!
ఆకుల లలిత రాజకీయ ప్రస్థానం చూస్తే.. ఎంపీటీసీగా ప్రారంభించి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మహిళా కాంగ్రెస్ నాయకురాలిగా అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. కానీ 2018లో కాంగ్రెస్ వదిలి బీఆర్‌ఎస్‌లో చేరడం, తర్వాత మళ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లోకి తిరిగి రావడం ఆమెకు పెద్ద మైనస్ అయింది. ప్రస్తుతం కార్పొరేషన్ ఛైర్మన్ పదవిపై ఆశ పెట్టుకున్నా.. స్థానిక సీనియర్ నాయకుల వ్యతిరేకత కారణంగా ఆమెకు అవకాశం దక్కడం లేదు. చివరికి జిల్లా సమావేశాల్లో ఫ్లెక్సీలో ఫోటో లేకపోవడం, వేదికపై కుర్చీ దక్కక పోవడం ఆమెను తీవ్రంగా కలచివేసింది.
ఇటు అరికెల నర్సారెడ్డి పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉంది. మొదట టీడీపీలో, తర్వాత కాంగ్రెస్, మధ్యలో బీఆర్‌ఎస్, తిరిగి కాంగ్రెస్ అనే మారిన మార్గాల వల్ల ఆయన్ను కూడా పార్టీ నేతలు నమ్మకంగా చూడటం లేదని సమాచారం. డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడినా పెద్దల ఒప్పందం లేకపోవడం, ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ స్థాయి పదవికి ప్రయత్నాలు విఫలమవడం వల్ల ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డితో సన్నిహితత ఉన్నప్పటికీ.. సీనియర్ల ఒత్తిడి వల్ల అవకాశాలు దూరంగా ఉన్నాయన్న వాదనలు నడుస్తున్నాయి. ఈ ఇద్దరి పరిస్థితి ఇప్పుడు నిజామాబాద్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
This website uses cookies.