Former MLCs : ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీ ల బాధలు అన్నీఇన్నీ కావు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Former MLCs : ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీ ల బాధలు అన్నీఇన్నీ కావు..!

 Authored By ramu | The Telugu News | Updated on :3 July 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  కనీసం కాంగ్రెస్ ప్లెక్సీ లలో కూడా ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలను పెట్టడం లేదు..!!

  •  Former MLCs : ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీ ల బాధలు అన్నీఇన్నీ కావు..!

Former MLCs  : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా పదవుల కోసం కొట్లాటలు , విమర్శలు , అలగడలు , ఆరోపణలు చేయడం ఇలా నిత్యం జరుగుతూనే ఉంటుంది. తాజాగా మాజీ ఎమ్మెల్సీ లు సైతం అధిష్టానం పై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది.నిజామాబాద్ కాంగ్రెస్ వర్గాల్లో ప్రస్తుతం ఇద్దరు సీనియర్ నేతలు తీవ్ర మనోవేదనలో ఉన్నట్లు వినికిడి. వారు పార్టీకి అనేక సేవలు చేసినప్పటికీ, ఒక చిన్న తప్పే వారి రాజకీయ భవిష్యత్తుకు అడ్డు తగిలిందని స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత మరియు అరికెల నర్సారెడ్డి. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో పనిచేసి అనేక పదవుల్లో ఉన్నారు. కానీ పార్టీ మారిన దోషంతో ఇప్పుడు పార్టీ వేదికలపై సీటు కోసం ఎదురుచూస్తూ, ఫ్లెక్సీల్లో ఫోటోలు లేక అణగారిపోతున్న పరిస్థితి వీరి వేదనను వివరిస్తోంది.

Former MLCs ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీ ల బాధలు అన్నీఇన్నీ కావు

Former MLCs : ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీ ల బాధలు అన్నీఇన్నీ కావు..!

Former MLCs : పాపం ఆ ఆ ఇద్దరు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలను చూస్తుంటే బాధేస్తుంది

ఆకుల లలిత రాజకీయ ప్రస్థానం చూస్తే.. ఎంపీటీసీగా ప్రారంభించి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మహిళా కాంగ్రెస్ నాయకురాలిగా అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. కానీ 2018లో కాంగ్రెస్ వదిలి బీఆర్‌ఎస్‌లో చేరడం, తర్వాత మళ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లోకి తిరిగి రావడం ఆమెకు పెద్ద మైనస్ అయింది. ప్రస్తుతం కార్పొరేషన్ ఛైర్మన్ పదవిపై ఆశ పెట్టుకున్నా.. స్థానిక సీనియర్ నాయకుల వ్యతిరేకత కారణంగా ఆమెకు అవకాశం దక్కడం లేదు. చివరికి జిల్లా సమావేశాల్లో ఫ్లెక్సీలో ఫోటో లేకపోవడం, వేదికపై కుర్చీ దక్కక పోవడం ఆమెను తీవ్రంగా కలచివేసింది.

ఇటు అరికెల నర్సారెడ్డి పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉంది. మొదట టీడీపీలో, తర్వాత కాంగ్రెస్, మధ్యలో బీఆర్‌ఎస్‌, తిరిగి కాంగ్రెస్ అనే మారిన మార్గాల వల్ల ఆయన్ను కూడా పార్టీ నేతలు నమ్మకంగా చూడటం లేదని సమాచారం. డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడినా పెద్దల ఒప్పందం లేకపోవడం, ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ స్థాయి పదవికి ప్రయత్నాలు విఫలమవడం వల్ల ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డితో సన్నిహితత ఉన్నప్పటికీ.. సీనియర్ల ఒత్తిడి వల్ల అవకాశాలు దూరంగా ఉన్నాయన్న వాదనలు నడుస్తున్నాయి. ఈ ఇద్దరి పరిస్థితి ఇప్పుడు నిజామాబాద్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది