Surveyor Tejeshwar : ఐదు సార్లు ప్లాన్ చేసిన భార్య.. తేజేశ్వర్ కేసులో బయటకువస్తున్న సంచలన విషయాలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :24 June 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో బయటకువస్తున్న సంచలన విషయాలు

  •  భర్త ను హత్య చేయడానికి ఐదు సార్లు ప్లాన్ చేసిన భార్య

  •  Surveyor Tejeshwar : ఐదు సార్లు ప్లాన్ చేసిన భార్య.. తేజేశ్వర్ కేసులో బయటకువస్తున్న సంచలన విషయాలు..!

Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో భర్తను సుపారీ గ్యాంగుతో హత్య చేయించేందుకు భార్య ఐశ్వర్య చేసిన కుతంత్రాలు ఒక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఐదుసార్లు హత్యాయత్నం నుంచి తప్పించుకున్న తేజేశ్వర్ చివరకు ఆరోసారి హంతకుల పాలయ్యాడు. ప్రైవేట్ సర్వేయర్‌గా పనిచేస్తున్న తేజేశ్వర్‌ను సర్వే పని ఉందంటూ కారులో ఎక్కించుకుని ముందే ప్రణాళిక వేసిన దుండగులు కత్తితో గొంతుకోసి హత్య చేసి, మృతదేహాన్ని తాళ్లతో కట్టి కాల్వలో పడేశారు…

Surveyor Tejeshwar : ఐదు సార్లు ప్లాన్ చేసిన భార్య.. తేజేశ్వర్ కేసులో బయటకువస్తున్న సంచలన విషయాలు..!

Surveyor Tejeshwar : ఐదు సార్లు ప్లాన్ చేసిన భార్య.. తేజేశ్వర్ కేసులో బయటకువస్తున్న సంచలన విషయాలు..!

Surveyor Tejeshwar : రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకునేలా చేసిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య వ్యవహారం

తేజేశ్వర్‌తో వివాహం అయినప్పటికీ, అతని భార్య బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో సంబంధం కొనసాగిస్తుండగా, భర్త అడ్డు అవుతాడని భావించిన ఆమె ఆయనను హతమార్చేందుకు కుట్ర పన్నింది. తేజేశ్వర్ బండిపై గోప్యంగా జీపీఎస్ ట్రాకర్ అమర్చి అతని లొకేషన్‌ను హంతకులకు అందించింది. తిరుమలరావు, ఐశ్వర్యతో కలిసి రూ.75 వేలు సుపారీ గ్యాంగుకు ఇచ్చి హత్యను నిర్వాహించారు. ఐశ్వర్య తండ్రి అంగీకరించకపోయిన తర్వాత మేనేజర్ తన భార్యకు “పిల్లలు లేరు కదా, ఆమెను పెళ్లి చేసుకుంటా” అని చెప్పినప్పటికీ ఆమె నిరాకరించింది. అయినప్పటికీ ఐశ్వర్యతో సంబంధాన్ని కొనసాగించాడు.

పోలీసులు ఇప్పటివరకు ఈ హత్యకేసులో ప్రధాన నిందితులైన బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో పాటు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, హత్యకు పాల్పడిన మనోజ్, సహకరించిన ఇద్దరు, క్యాబ్ డ్రైవర్, మధ్యవర్తి వ్యక్తిని కలుపుకొని మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. తేజేశ్వర్ నిశ్చితార్థం రద్దైన తర్వాత కూడా ఐశ్వర్య మాటలు నమ్మి కుటుంబం వద్దన్నా కానీ వెళ్లి ఆమెను పెళ్లిచేసుకున్నాడు. కానీ ఆ విశ్వాసమే చివరికి ప్రాణాలమీదకి వచ్చింది.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి