TRS Party : అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణలో తమకు తిరుగులేదు అని బీరాలు పోయిన బీఆర్ఎస్ కు ప్రజలు ఎన్నికల్లో పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పవచ్చు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే తెలంగాణలో నెంబర్ వన్ అని చెప్పుకునన్న బీఆర్ఎస్ ను ప్రజలు ఎందుకు దూరం పెట్టారు. నిజంగా ఈ ఓటమి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఒక రకంగా తీవ్రంగా కృంగిపోయేలా చేసింది. తెలంగాణ వచ్చిన నాటి నుంచి తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. వ్యవసాయంలో దేశానికే తలమానికంగా నిలిచేలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా ప్రజలు ఎందుకు ఇలాంటి తీర్పునిచ్చారని తన వద్దకు వచ్చిన నేతలతో పదే పదే ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్.
తెలంగాణలో కరెంట్ పోకుండా చేశాం. ఇంటింటికి తాగు నీరు అందించాం. రైతుబంధు, రైతుభరోసాతో రైతాంగానికి అండగా నిలిచినా.. ప్రజలు తమ పార్టీని ఎందుకు ఆదరించలేదనే దానిపై బీఆర్ఎస్ నాయకులు మల్లగుల్లాలు చెందుతున్నారు.ఇప్పుడు బీఆర్ఎస్‌లో ప్రక్షాళన మొదలైందా? నేతలంతా పార్టీ విడిచి పోవడంతో గులాబీ నేత కేసీఆర్ ఆలోచనలో పడ్డారా? పార్టీ డౌన్‌ఫాల్‌కు కారణాలు వెతుకుతున్నారా? అంటే అవునని అనిపిస్తుంది. తాజాగా రీసెంట్‌గా పటాన్‌చెరులో మీటింగ్‌లో మాజీమంత్రి హరీష్‌రావు టీఆర్ఎస్ కండువాతో దర్శనమిచ్చారు. దీంతో బీఆర్ఎస్ పేరు కాస్త టీఆర్ఎస్‌గా మారిపోయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. పార్టీ ప్రారంభం నుంచి ఇదే పేరుతో కంటిన్యూ అయ్యింది. రెండుసార్లు ఇదే పేరుతో అధికారంలోకి వచ్చింది ఆ పార్టీ. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించి టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా పేరు మార్చారు కేసీఆర్. పేరు మార్చిన మూడేళ్లకే రాష్ట్ర రాజకీయాలకు దూరమయ్యారు. బీఆర్ఎస్ తన అస్తిత్వం నిలబెట్టుకునేందుకు ఇప్పుడు పోరాడుతోంది. బీఆర్ఎస్ అంటే తెలంగాణతో బంధం తెగిపోయిందనే భావన నేపథ్యంలో మళ్లీ సెంటిమెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో మార్పులు చేపట్టినట్టు తెలుస్తోంది. తాజాగా పటాన్‌చెరు పార్టీ కార్యకర్తల మీటింగ్‌లో మాజీమంత్రి హరీష్‌రావు టీఆర్ఎస్ కండువాతో దర్శనమివ్వడంపై
అందరిలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.