Telangana Assembly Budget 2024 : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ బీఆర్ఎస్ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాళోజీ కవితతో గవర్నర్ తమిళిసై అసెంబ్లీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కంచెను తొలగించామన్నారు. ప్రజాభవనంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజలకు అనుమతి లభించిందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది అన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సకాలంలో అమలు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని అప్పుల మయం చేసి మాకు అప్పగించారని గవర్నర్ బీఆర్ఎస్ కు చురకలు అంటించారు. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేశారన్నారు.
రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని, 6 గ్యారంటీలలో రెండు గ్యారెంటీలను అమలు చేశామన్నారు. త్వరలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని, అర్హులకు రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ప్రస్తుతం తెలంగాణలో ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉందని అన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు, రెండు లక్షల ఉద్యోగాలపై దృష్టి పెట్టామన్నారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను చక్కబెడతామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. దశాబ్ద కాలంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేసామన్నారు.
ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నాభిన్నం చేశారని ఆమె సంచలనం వ్యాఖ్యలు చేశారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించామన్నారు. ప్రభుత్వం లోకి వచ్చిన వెంటనే రెండు గ్యారెంటీలను అమలు చేసాం. త్వరలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులు మయం చేసి అప్పగించారు. దశాబ్ద కాలంలో నష్టపోయిన సంస్థలను పునరుద్ధరిస్తున్నామని అన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నామని, రైతులు ,మహిళలు, యువతకు ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉన్నామని గవర్నర్ అన్నారు. ఇంటర్నెట్ ను కనీస అవసరంగా గుర్తించి అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నామని, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందిస్తామని అన్నారు. 1000 ఎకరాల్లో 10 , 12 ఫార్మా విలేజ్ లు ఏర్పాటు చేస్తామని గవర్నర్ తమిళి సై తెలిపారు.
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.