ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఇది కాంగ్రెస్ కు తొలి బడ్జెట్ కావడం విశేషం. ఆరు గ్యారంటీలకు సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు ఎలా ఉంటాయని అందరూ ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ పై ఈనెల 12న చర్చ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి శుభవార్త చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని సమాచారం. లోక్ సభ ఎన్నికలు వస్తున్నవేళ తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, అది ప్రజలకు మేలు చేకూరేలా ఉంటుందని భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మార్క్ ఈ బడ్జెట్ లో కనిపిస్తుందని అంటున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు 10 కోట్ల రూపాయలు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన కసరత్తును కూడా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పూర్తి చేసినట్టు సమాచారం. మొత్తం 119 నియోజకవర్గాలకు 1190 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో అన్ని నియోజకవర్గాలకు ఎప్పుడు బడ్జెట్లో నిధులను కేటాయించలేదు. ఒక్కోచోట విద్యారంగా అభివృద్ధికి రెండు కోట్ల రూపాయలు, తాగునీటి సౌకర్యాల కల్పనకు కోటి రూపాయలు కేటాయిస్తారని చెబుతున్నారు. ఈసారి బడ్జెట్ 2.60 లక్షల కోట్ల నుంచి 2.70 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇది గత బడ్జెట్ కంటే పది శాతం తక్కువ. వాస్తవ రాబడును వాస్తవ వ్యయాల ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన జరిగిందని సమాచారం. ఇక మొదటి సంవత్సరంలోనే అన్ని హామీలను అమలు చేయడం సాధ్యం కాదని ఈసారి కొన్నింటిని అమలు చేసి ప్రజలకు భరోసా ఇవ్వబోతున్నారు. తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు కాంగ్రెస్ సర్కార్ కొన్నింటికి చోటు కల్పించింది.
మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి మూడు వేల కోట్లకు పైగా నిధులను కేటాయించే అవకాశం ఉందంటున్నారు. ఇక 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించడం ప్రభుత్వానికి భారంగా పరిణమించనుంది. దీనికోసం 4000 కోట్లకు పైగానే విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. 500 కే గ్యాస్ సిలిండర్ అందజేతకు కూడా నిధుల కేటాయింపు ఉండనుంది. కళ్యాణమస్తు పథకం కింద 1,00,116 నగదును అందిస్తూనే తులం బంగారాన్ని కూడా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. అంటే ఒక్కొక్క లబ్ధిదారులకు 1.70 లక్షలకు వెచించాల్సి ఉంటుంది. వివిధ శాఖలు అందజేసిన బడ్జెట్ ప్రతిపాదనలను కూడా పక్కాగా లెక్కించి పరిగణలోకి తీసుకున్నారు. ప్రతిపాదించే బడ్జెట్ 100% వ్యయమయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. గత బీఆర్ ఎస్ సర్కార్ 2,90,396 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఏపీ నుంచి విద్యుత్ సంస్థల బకాయిల తాలూకు 17,828 కోట్లు, గ్రాంట్లు కాంట్రిబ్యూషన్ల కింద 4000 కోట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే ఆ నిధులు అందేవి కావున విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తన ప్రాధమ్యాలను పరిగణలోకి తీసుకొని ఈసారి బడ్జెట్ను రూపొందించినట్లు చెబుతున్నారు.
Telangana Budget 2024 Live Updates : తెలంగాణ బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్.. : నంది అవార్డును గద్దర్ అవార్డు పేరుతో సినిమా, టీవీ కళాకారులకు అందజేత. ప్రజాయుద్ధనౌక గద్దర్ అన్నకు మేమిచ్చే నివాళి.
అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటన.
Telangana Budget 2024 Live Updates : తెలంగాణ బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్.. : రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యం, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కొత్త చిహ్నం. రాచరిక ఆనవాళ్లతో ఉన్న రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తూ వాహన రిజిస్ట్రేషన్ కోడ్ ను టీఎస్ నుంచి టీజీగా మార్పు.
రాష్ట్రంలో అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా చేయాలన్నదే లక్ష్యం. గురుకుల పాఠశాలలో సొసైటీ ద్వారా రెండు ఎంబీఏ కళాశాలలు ఏర్పాటు. నాణ్యమైన విద్య అందించాలన్నదే ధ్వేయం.
15 వేల పోలీసు ఉద్యోగాలు, నోటిఫికేషన్ కు అదనంగా 64 గ్రూప్- 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, 5 లక్షల ప్రమాద భీమా
Telangana Budget 2024 Live Updates : తెలంగాణ బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్.. : గత ప్రభుత్వం ఫీజు ప్రీయంబర్స్మెంట్ నిధులను సకాలంలో విడుదల చేయలేదు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు స్కాలర్ షిప్ లను అందించేందుకు ఏర్పాట్లు. తెలంగాణలో ఐటిఐ కాలేజీలో చదివిన విద్యార్థులకు 100% ఉద్యోగ అవకాశాలు. ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళా స్వయం సహాయ సంఘాలను ప్రోత్సహిస్తాం.
రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందించడానికి కట్టుబడి ఉన్నాం. గృహ జ్యోతి పథకం ద్వారా అర్హులైన వారికి 200 యూనిట్ల ఉచిత కరెంటు. కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టు నిర్మించే విధానం రాష్ట్రానికి శాపంగా మారింది. లక్షల కోట్ల ఖర్చుతో అవినీతి ఎంతో తేల్చాల్సి ఉంది. మేడిగడ్డ, అన్నారం, సుందెల్ల బ్యారేజీల నిర్మాణంపై జరిగిన అవకతవకలపై విచారణ. కృష్ణ, గోదావరి జలాల్లో నీటి కేటాయింపులపై రాజీపడం.
Telangana Budget 2024 Live Updates : తెలంగాణ బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్.. : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల సాయం.
అధికారంలోకి వచ్చిన వెంటనే 6,956 నర్సింగ్ ఆఫీసర్లను నియమించాం. త్వరలోనే ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ప్రారంభం
15 వేల పోలీసు ఉద్యోగాలు, నోటిఫికేషన్ కు అదనంగా 64 గ్రూప్- 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, 5 లక్షల ప్రమాద భీమా
Telangana Budget 2024 Live Updates : తెలంగాణ బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్.. : టీఎస్పీఎస్సీకి 40 కోట్లు. త్వరలో మెగా డిఎస్సీ ఉంటుంది.
గత ప్రభుత్వం పెట్టిన ధరణి పోర్టల్ చాలామందికి భారంగా మారింది. ఆ ధరణి వలన ఎంతోమంది సొంత భూమిని అమ్ముకోలేకపోయారు.
రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సత్వర చర్యలు. ధరణి పోర్టల్ పై అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు.
Telangana Budget 2024 Live Updates : తెలంగాణ బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్.. : అర్హులకే రైతుబంధు ఇస్తాం. రైతుబంధు నిబంధనలు పున:సమీక్షిస్తాం. ఎకరాకు రూ. 15,000 ఇవ్వబోతున్నాం. కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇస్తాం.
రైతుబంధుతో పెట్టుబడిదారులు, అనర్హులు లాభపడ్డారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు కొన్న భూములకు సైతం రైతుబంధు ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో నకిలీ విత్తనాల సమస్య ఉండేది. నకిలీ విత్తనాలతో మోసపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
Telangana Budget 2024 Live Updates : తెలంగాణ బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్.. : 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యత. మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి నెలకు రూ. 300 కోట్లు చెల్లిస్తున్నాం. ఆరోగ్యశ్రీ కి అవసరమైన నిధులు అందిస్తాం. గృహ జ్యోతి ద్వారా అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. త్వరలో రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం.
Telangana Budget 2024 Live Updates : తెలంగాణ బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్.. : విద్యారంగానికి రూ. 21,389 కోట్లు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ. 500 కోట్లు. యూనివర్సిటీలో సదుపాయాలకు రూ. 500 కోట్లు. వైద్య రంగానికి 11,500 కోట్లు. విద్యుత్ గృహ జ్యోతికి 2418 కోట్లు. విద్యుత్ సంస్థలకు 16,825 కోట్లు. గృహ నిర్మాణానికి 7740 కోట్లు.
ప్రజావాణిలో రెండు నెలల్లో వచ్చిన దరఖాస్తులు 43,054. ఇళ్ల కోసం వచ్చినవి 14,951. దరఖాస్తుల పరిశీలన కోసం కలెక్టర్లు శాఖాధిపతులకు పర్యవేక్షణ బాధ్యత. వాస్తవాలకు దూరంగా గత బడ్జెట్ ఉందని దుబారా ఖర్చులను తగ్గించామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రతి హామీని అమలు చేస్తామన్న ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు.
Telangana Budget 2024 Live Updates : తెలంగాణ బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్.. : 2024 – 25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ. 2,75,851 కోట్లు. ఆరు గ్యారెంటీల కోసం రూ. 53,196 కోట్లు అంచనా. పరిశ్రమల శాఖకు రూ. 2,543 కోట్లు, ఐటీ శాఖకు రూ. 774 కోట్లు, పంచాయితీ రాజ్ రూ. 40080 కోట్లు. పురపాల శాఖకు 11,692 కోట్లు. మూసీ రివర్ ఫ్రాంట్ కు 1000 కోట్లు వ్యవసాయ శాఖకు రూ. 19,746 కోట్లు .
ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ. 1250 కోట్లు. ఎస్సీ సంక్షేమం రూ. 21,874 కోట్లు. ఎస్టీ సంక్షేమం రూ. 13,013 కోట్లు. మైనారిటీ సంక్షేమం రూ. 2262 కోట్లు. బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు. బీసీ సంక్షేమం 8వేల కోట్లు.
Telangana Budget 2024 Live Updates : తెలంగాణ బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్.. 2024 – 25 అంచనా వ్యయం రూ. 2,75,891 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ. 2,01,178 కోట్లు. మూలధన వ్యయం 29,669 కోట్లు. మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అంటూ భట్టి విక్రమార్క తెలిపారు. సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ను రూపొందించామన్నారు.
సవరించిన అంచనాలు రూ. 2,24,625 కోట్లు. రెవెన్యూ వ్యయం 1,69,141 కోట్లు. మూలధన వ్యయం రూ. 24,178 కోట్లు. రెవెన్యూ ఖాతాలో మిగులు 9,031 కోట్లు. ద్రవ్య లోటు రూ. 33,786 కోట్లు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.