Telangana : కోర్ అర్బన్ ఏరియా అంతటా డ్రోన్ సర్వే.. సీఎం సమీక్ష..!
Telangana : తెలంగాణ Telangana కోర్ అర్బన్ రీజియన్ అయిన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపలి ఏరియా మొత్తాన్నీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు, నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులకు చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా అంతటా నిర్వహించాలన్నారు. నానక్‌రామ్‌గూడలోని హెచ్ఎండీఏ (HMDA) కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కోర్ అర్బన్ (Telangana Core Urbun) అభివృద్ధి అంశాలను ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. నగరంలో కొత్తగా మరో 7 ఫ్లైఓవర్లు నిర్మించాలన్న ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా సీఎం గారు అధికారులకు పలు సూచనలు చేశారు.
Telangana : కోర్ అర్బన్ ఏరియా అంతటా డ్రోన్ సర్వే.. సీఎం సమీక్ష..!
ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎలాంటి అంతరాయం లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వీలుగా హైదరాబాద్ నగరంలో గృహాలు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలి. Greater Hyderabad లో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారాన్ని తీసుకుని వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.
కోర్ అర్బన్ ప్రాంతంలో చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధానమైన మరో 7 కూడళ్లలో ఫ్లై ఓవర్ నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా భూసేకరణ, ఇతర పనులను పూర్తి చేసి, వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలి. ఈ సమావేశంలో మౌలిక సదుపాయాల సలహాదారు శ్రీనివాసరాజు గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ గారు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇలాంబర్తి గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
This website uses cookies.