Categories: andhra pradeshNews

Vallabhaneni Vamsi : వ‌ల్ల‌భ‌నేని వంశీని జైలుకి త‌ర‌లింపు.. 14రోజులు రిమాండ్..!

Vallabhaneni Vamsi : గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ YCP  నేత Vallabhaneni Vamsi వల్లభనేని వంశీని Andhra pradesh ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు Police అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా, రెండ్రోజుల క్రితం హఠాత్తుగా సత్యవర్ధన్ కేసును వెనక్కి తీసుకున్నారు. అయితే వంశీ, అతని అనుచరులు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరింపులు దిగారని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. అందుకే అతను కేసు వెనక్కి తీసుకున్నారని పోలీసులకు చెప్పారు

Vallabhaneni Vamsi : వ‌ల్ల‌భ‌నేని వంశీని జైలుకి త‌ర‌లింపు.. 14రోజులు రిమాండ్..!

Vallabhaneni Vamsi జైలుకి త‌ర‌లింపు..

గురువారం మధ్యాహ్నం 1గంట సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వంశీని తరలించిన పోలీసులు.. దాదాపు ఎనిమిది గంటలపాటు అతన్ని ప్రశ్నించారు. విజయవాడ ఫోర్త్ ఏసీఎంఎం జడ్జి ఎదుట రాత్రి 10.30 గంటలకు హాజరుపర్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ అర్ధరాత్రి 2.30గంటలకు వంశీకి, అతడి అనుచరులు లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్ లకు 14రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు.

దీంతో వారిని శుక్రవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.వల్లభనేని వంశీ అరెస్టుపై అతని సతీమణి పంకజశ్రీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నా భర్త అరెస్టుపై న్యాయపోరాటం చేస్తానని అన్నారు. అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉంది. వంశీకి ఆరోగ్యం బాగాలేదు.. నేను టాబ్లెట్స్ ఇచ్చాను. ఉదయం నుంచి కనీసం కాపీ కూడా తాగలేదు. ఎందుకు అరెస్టు చేశారో..? ఏ కేసులో అరెస్టు చేశారో ఇప్పటికీ పోలీసులు చెప్పలేదు అని త‌న ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

Recent Posts

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

7 hours ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

8 hours ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

10 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

12 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

14 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

16 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

17 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

18 hours ago