Home » News » Telangana Elections Results 2023 Barrelakka In Lead
News

Barrelakka : కొల్లాపూర్ లో బ‌ర్రెల‌క్క ముందంజ‌..!

Authored By
aruna
The Telugu News | Published on: December 3, 2023, 10:22 am
Advertisement

Barrelakka : Telangana Elections Results 2023  తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ర్రెల‌క్క ముందంజ‌లో ఉన్నారు. ఆమె నిరుద్యోగుల త‌రుపున అక్క‌డ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసిన విష‌యం తెలిసిందే. పోస్ట‌ల్ బ్యాలెట్ లో బ‌ర్రెల‌క్క ముందంజ‌లో ఉన్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ అభ్య‌ర్థుల కంటే కూడా బర్రెల‌క్క ముందంజ‌లో ఉన్నారు. ఈవీఎం లెక్కింపులో చూస్తే ఇంకా ఎవ‌రు లీడ్ లో ఉన్నారో తెలియ‌డం లేదు కానీ.

Advertisement

పోస్ట‌ల్ బ్యాలెట్ లో మాత్రం ముందంజ‌లో ఉండి బ‌ర్రెల‌క్క రికార్డు క్రియేట్ చేశారు. బ‌ర్రెల‌క్క స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా అక్క‌డ పోటీ చేసిన‌ప్ప‌టి నుంచి కొల్లాపూర్ రాష్ట్రంలోనే చ‌ర్చ‌నీయంశ‌మైంది. ఈనేప‌థ్యంలో త‌న‌ను పోటీ నుంచి త‌ప్పించేందుకు ఇత‌ర పార్టీల అభ్య‌ర్థులు ర‌క‌ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేసిన విష‌యం తెలిసిందే.

అయినా కూడా బ‌ర్రెల‌క్క ఏమాత్రం భ‌య‌ప‌డ‌కుండా ఎన్నిక‌ల పోటీలో నిల‌బడ్డారు. త‌న‌కు చాలామంది స‌పోర్ట్ ఇచ్చారు. హైకోర్టు, సుప్రీం న్యాయ‌వాదులు త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో ఆమె ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్భ‌యంగా నిర్వ‌హించారు. ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తుండ‌గానే త‌న త‌మ్ముడిపై ఇత‌ర పార్టీల నాయ‌కులు దాడి చేసిన విష‌యం తెలిసిందే.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి